Weight Loss Drinks: పరగడుపున ఈ గింజల నీరు తాగండి.. అధిక బరువుని తగ్గించుకోండి..!
Weight Loss Drinks: సులువుగా బరువు తగ్గాలనుకుంటే ఉదయం పూట దినచర్యను అనుసరించాలి.
Weight Loss Drinks: ఈ రోజుల్లో చాలామంది అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నారు. తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మీరు సులువుగా బరువు తగ్గాలనుకుంటే ఉదయం పూట దినచర్యను అనుసరించాలి. అంటే పరగడుపున నానబెట్టిన గింజల నీటిని తాగాలి. దీనివల్ల శరీరానికి అనేక రకాల పోషకాలు అందుతాయి. అయితే ఎలాంటి రకాల గింజల నీటిని తాగాలో ఈరోజు తెలుసుకుందాం.
మెంతి నీరు
బరువును తగ్గించుకోవాలనుకుంటే ప్రతిరోజూ ఉదయం నిద్రలేచి రాత్రంతా నానబెట్టిన మెంతుల నీటిని తాగాలి. ఇందులో ఉండే పీచు వల్ల కడుపునిండిన భావన ఏర్పడుతుంది. దీని వల్ల బరువు కంట్రోల్‌లోకి వస్తుంది.
తులసి సీడ్ వాటర్
ఖాళీ కడుపుతో రోజూ తులసి నీటిని తాగడం వల్ల శరీరం నుంచి టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి. రోగనిరోధక శక్తి బలపడుతుంది. సులువుగా బరువు తగ్గుతారు.
నానబెట్టిన బాదం
నానబెట్టిన బాదం, వాల్‌నట్‌లతో రోజును ప్రారంభించడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉంటారు. అంతేకాకుండా బరువును కూడా సులభంగా తగ్గుతారు. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో బాదం తినడం వల్ల వ్యక్తి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
ఎండు ద్రాక్ష
ఎండుద్రాక్షలో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిని క్రమబద్దీకరిస్తాయి. అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఎండుద్రాక్ష నీటిని తాగడం ఆరోగ్యానికి చాలామంచిది. అంతేకాకుండా బరువు కూడా సులువుగా తగ్గుతారు.