Belly Fat: అధిక బరువుతో ఇబ్బందులా.. రాత్రిపూట ఈ చిట్కాను పాటిస్తే సరి.. స్లిమ్‌గా మారిపోతారంతే..!

Weight Loss: దాల్చిన చెక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉన్న మసాలా. ఆహారం రుచిని మెరుగుపరచడానికి వంటల్లో దాల్చిన చెక్కను ఉపయోగిస్తుంటారు. అయితే దాల్చిన చెక్క టీ తాగడం వల్ల బరువు తగ్గవచ్చని మీకు తెలుసా?

Update: 2023-05-04 15:30 GMT

Belly Fat: అధిక బరువుతో ఇబ్బందులా.. రాత్రిపూట ఈ చిట్కాను పాటిస్తే సరి.. స్లిమ్‌గా మారిపోతారంతే..!

Cinnamon Tea: దాల్చిన చెక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉన్న మసాలా. ఆహారం రుచిని మెరుగుపరచడానికి వంటల్లో దాల్చిన చెక్కను ఉపయోగిస్తుంటారు. అయితే దాల్చిన చెక్క టీ తాగడం వల్ల బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? ఏలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే దాల్చిన చెక్క టీ తయారీ ఎలా చేయాలో కూడా చూద్దాం. దాల్చిన చెక్క టీ తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, మీ జీవక్రియ పెరుగుతుంది. దాల్చిన చెక్క టీ గ్యాస్ సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు, ప్రతిరోజూ రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత దాల్చిన చెక్క టీ తాగితే, అది త్వరగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కాబట్టి దాల్చిన చెక్క టీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

దాల్చిన చెక్క టీ చేయడానికి కావలసిన పదార్థాలు-

ఒక కప్పు నీరు

దాల్చిన చెక్క పొడి ఒక టీస్పూన్

చిటికెడు నల్ల మిరియాలు

తేనె ఒక టీస్పూన్

నిమ్మరసం కొద్దిగా

దాల్చిన చెక్క టీ ఎలా తయారు చేయాలంటే?

దాల్చిన చెక్క టీని తయారు చేయడానికి, మీరు ముందుగా ఒక కప్పు నీటిని పాన్‌లో తీసుకోవాలి.

తర్వాత దాల్చిన చెక్క పొడి, ఎండుమిర్చి, నిమ్మరసం వేసి, కలపాలి.

ఆ తర్వాత మీరు ఈ మిశ్రమాన్ని బాగా మరగబెట్టాలి.

తర్వాత ఒక కప్పులో వడకట్టి అందులో తేనె వేసి కలపాలి.

ఇప్పుడు మీ ఆరోగ్యకరమైన దాల్చిన చెక్క టీ సిద్ధంగా ఉంది.

నడుము దగ్గర కొవ్వును కరిగించాలంటే, ఈ టీని రోజూ రాత్రిపూట తాగాలి.

గమనిక: ఇందులో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసమే. దీనిని పాటించే ముందు నిపుణులకు తప్పక సంప్రదించాలి.

Tags:    

Similar News