Sweating: అధిక చెమటని నిర్లక్ష్యం చేయకండి.. ఇది చాలా ప్రమాదం..!

Sweating: తనకి శత్రువైనా సరే అతడికి మధుమేహం రావాలని ఎవ్వరూ కోరుకోరు. ఎందుకంటే అది అంత ప్రమాదకరమైన వ్యాధి.

Update: 2022-08-21 11:26 GMT

Sweating: అధిక చెమటని నిర్లక్ష్యం చేయకండి.. ఇది చాలా ప్రమాదం..!

Sweating: తనకి శత్రువైనా సరే అతడికి మధుమేహం రావాలని ఎవ్వరూ కోరుకోరు. ఎందుకంటే అది అంత ప్రమాదకరమైన వ్యాధి. ఇది ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం బాధపడాల్సిందే. చాలామంది వారికి మధుమేహం ఉందని తెలియక సాధారణ జీవనశైలి, ఆహారపు అలవాట్లను కొనసాగిస్తే వారి రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా అదుపు తప్పుతుంది. గుండె, మూత్రపిండాల వ్యాధులతో సహా శరీరంలో అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. అందుకే మధుమేహం ప్రారంభ లక్షణాలని ముందుగానే గుర్తించాలి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. .

శరీరం చెమటలు పట్టడం చాలా సాధారణ ప్రక్రియ. వేసవిలో అయితే సర్వసాధారణం. అయితే మీకు విపరీతంగా చెమట పట్టినట్లు అనిపించే సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాంటి పరిస్థితిలో అప్రమత్తంగా ఉండటం అవసరం. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో సెకండరీ హైపర్ హైడ్రోసిస్ అంటారు. మీరు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే అది అనేక వ్యాధులకు కారణం అవుతుంది.

శరీరం ఎక్కువగా చెమట పట్టడం ప్రారంభించినప్పుడు అది మధుమేహానికి కూడా కారణమవుతుంది. అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి అదుపు తప్పిందని, శరీరం నుంచి వివిధ హార్మోన్లు విడుదలవుతున్నాయని అర్థం. మధుమేహం మన స్వేద గ్రంధులను ప్రభావితం చేస్తుంది. అధిక చెమటకి కారణమవుతుంది. అయితే అధిక చెమటను మధుమేహం లక్షణంగా పరిగణించాల్సిన అవసరం లేనప్పటికీ అనేక ఇతర కారణాలు దీనికి కారణం అయ్యే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News