Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లో మరిచిపోయి కూడా ఈ ఆహారాలు తినవద్దు..!

Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లో మరిచిపోయి కూడా ఈ ఆహారాలు తినవద్దు..!

Update: 2022-07-11 02:30 GMT

Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లో మరిచిపోయి కూడా ఈ ఆహారాలు తినవద్దు..!

Breakfast: ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా తీసుకునే ఆహారంపై శ్రద్ద పెట్టాలి. ప్రతిరోజు ఏమి తినాలి.. ఎప్పుడు తినాలి.. ఎలా తినాలనేది తెలిసి ఉండాలి. కచ్చితంగా ఒక డైట్‌ మెయింటెన్ చేయాలి. ముఖ్యంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో మంచి ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే రోజు మొత్తం మీరు ఏ విధంగా ఉండాలో ఈ ఆహారమే నిర్ణయిస్తుంది. ఈ సందర్భంలో మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని ఆహారాలకి దూరంగా ఉండాలి. వాటి గురించి తెలుసుకుందాం.

1. ఫ్రూట్ జ్యూస్

బ్రేక్‌ ఫాస్ట్‌లో ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగుతారు. ఇది ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. అల్పాహారం ఎప్పుడైనా కడుపు నిండుగా ఉండే ఆహారాన్ని తినాలి. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో ఏదైనా హెవీగా తినాలి కానీ జ్యూస్ తాగకూడదు.

2. మైదా ఆహారాలు

బ్రేక్ ఫాస్ట్‌లో ఎప్పుడు మైదాతో త‌యారు చేసిన ఆహారాలు తీసుకోకూడ‌దు. ముఖ్యంగా బోండాలు, ప‌రోటాలు వంటివి తిన‌కూడ‌దు. ఇవి జీర్ణ వ్యావ‌స్థ‌పై చెడు ప్ర‌భావం చూపుతాయి.

3. బ్రెడ్ అండ్ జామ్‌

బ్రెడ్ అండ్ జామ్‌ను బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకుంటారు. కానీ ఉద‌యంపూట బ్రెడ్‌తో జామ్ తీసుకోవ‌డం ఆరోగ్యానికి మంచిది కాద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

4. తీపి ప‌దార్థాలు

ఇక బ్రేక్ ఫాస్ట్‌లో స్కీట్స్‌, ఇత‌ర తీపి ప‌దార్థాలు, కూల్ డ్రింక్స్‌, ఫ్రూట్ జ్యూస్ లు, ప్రొసెస్ చేసిన ఆహారాలు తీసుకోకూడ‌దు. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి.

Tags:    

Similar News