Health Tips: గుడ్డుతింటే కొలస్ట్రాల్‌ పెరుగుతుందా.. వాస్తవం తెలుసుకోండి..!

Health Tips: ఉడకబెట్టిన గుడ్లను అల్పాహారంగా తినమని డాక్టర్లు సూచిస్తారు.

Update: 2022-10-23 14:48 GMT

Health Tips: గుడ్డుతింటే కొలస్ట్రాల్‌ పెరుగుతుందా.. వాస్తవం తెలుసుకోండి..!

Health Tips: ఉడకబెట్టిన గుడ్లను అల్పాహారంగా తినమని డాక్టర్లు సూచిస్తారు. ఎందుకంటే ఇది ప్రోటీన్‌కి గొప్ప మూలం అని చెప్పవచ్చు. అలాగే సహజ కొవ్వు కూడా ఇందులో ఉంటుంది. గుడ్డు ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. ప్రతి ఆరోగ్య నిపుణుడు ఈ సూపర్‌ఫుడ్ తినమని సలహా ఇస్తారు. అయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వ్యక్తులు గుడ్లు తినాలా వద్దా అనే ప్రశ్న తలెత్తుతుంది.. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

గుడ్డు కొలెస్ట్రాల్‌ను పెంచుతుందా..?

గుడ్లలో ఆరోగ్యానికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ ఉందని అనేక పరిశోధనలలో రుజువైంది. అలాంటి కొలెస్ట్రాల్ మన శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను నిర్మిస్తుంది. ఇందులో సంతృప్త లేదా ట్రాన్స్ ఫ్యాట్ ఉండదు. కాబట్టి LDL అంటే చెడు కొలెస్ట్రాల్ పెరగదు. అయితే వీటిని ఉడికించి తీసుకుంటే మంచిది. నూనెలో వేయించకూడుదు. దీనివల్ల లాభం కాకుండా నష్టమే జరుగుతుంది.

గుడ్డు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి అధిక రక్తపోటు, గుండె జబ్బుల నుంచి మనల్ని రక్షిస్తుంది. రోజుకు 2 గుడ్లు తింటే అది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతకు మించి తినాలనుకుంటే వైద్యుడిని సంప్రదించాలి. హెవీగా వర్కవుట్స్ చేసేవాళ్లు గుడ్లు ఎక్కువగా తినాలి. మనం మన రోజువారీ జీవితంలో కొలెస్ట్రాల్ స్థాయిని వేగంగా పెంచే కొన్ని ఆహార పదార్థాలను తింటాం. వీటిని నివారించడం ఉత్తమం. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది.

Tags:    

Similar News