Health Tips: మధుమేహ రోగులు కాళ్లు, చేతుల నొప్పులకి ఇలా చెక్‌ పెట్టండి..!

Health Tips: భారతదేశంలో మధుమేహ రోగులు రోజురోజుకి పెరిగిపోతున్నారు.

Update: 2022-07-20 08:00 GMT

Health Tips: మధుమేహ రోగులు కాళ్లు, చేతుల నొప్పులకి ఇలా చెక్‌ పెట్టండి..!

Health Tips: భారతదేశంలో మధుమేహ రోగులు రోజురోజుకి పెరిగిపోతున్నారు. మధుమేహం అనేది నయం చేయలేని వ్యాధి. అందుకే దీనిని నియంత్రించడం చాలా ముఖ్యం. లేదంటే ప్రమాదకరంగా మారుతుంది. శరీరంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోకపోతే అనేక రోగాలకి దారితీస్తుంది. అంతేకాదు చేతుల్లో, కాళ్లలో నొప్పులని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమస్యలు ఏర్పడినప్పుడు కొన్ని సులభమైన చర్యల ద్వారా తగ్గించుకోవచ్చు. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఎక్సర్ సైజ్

డయాబెటిస్‌ పేషెంట్లు చేతులు, కాళ్లలో నొప్పులు ఎదుర్కొంటే మెల్లగా ఎక్సర్ సైజ్ చేయాలి. కాళ్లని, చేతులని స్ట్రిచింగ్‌ చేస్తూ కదిలించాలి. ఇది మీ కండరాలను వదులుగా చేస్తుంది. సాగదీయడం వల్ల పాదాల నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.

ఐస్‌ ఉపయోగించడం

డయాబెటిస్‌ పేషెంట్లు చేతుల్లో, కాళ్లలో నొప్పులు ఉంటే కోల్డ్ థెరపీ సహాయం తీసుకోవచ్చు. ఇందుకోసం కాటన్ క్లాత్‌లో ఐస్ క్యూబ్‌లను పెట్టి 15 నిమిషాల వరకు వాపు ఉన్నచోట పెడుతూ ఉండాలి. దీనివల్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది.

మద్యపానం, ధూమపానం

డయాబెటీస్‌ పేషెంట్లు చేతులు, కాళ్ళ నొప్పులని తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. దీంతో పాటు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

ఏరోబిక్ వ్యాయామం

కీళ్ల నొప్పులకు ఏరోబిక్స్ వ్యాయామాలు మంచి ఉపశమనం అని చెప్పవచ్చు. మీరు మధుమేహం కారణంగా చేతుల్లో నొప్పిని కలిగి ఉంటే ప్రతిరోజు ఏరోబిక్ వ్యాయామాన్ని చేయండి.

Tags:    

Similar News