Hair Care: వ్యాయామం తర్వాత జుట్టు కడుగుతున్నారా.. లేదంటే ఈ సమస్యలు తప్పవు..!
Hair Care: వ్యాయామం తర్వాత జుట్టు కడుగుతున్నారా.. లేదంటే ఈ సమస్యలు తప్పవు..!
Hair Care: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలి. అప్పుడే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది వ్యాయామం కోసం ఉదయం, సాయంత్రం జిమ్‌కి వెళుతుంటారు. మరికొంతమంది పార్కులు, గ్రౌండ్‌కి వెళ్లి చెమటలు పట్టిస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ వ్యాయామం తర్వాత జుట్టు శుభ్రతపై శ్రద్ధ పెట్టకపోతే మొదటికే మోసం వస్తుంది. వ్యాయామం తర్వాత కచ్చితంగా జుట్టుని కడగాలి. కానీ కొంతమంది ఈ విషయంపై నిర్లక్యంగా వ్యవహరిస్తారు. వ్యాయామం చేసిన తర్వాత జుట్టు కడగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
1. జుట్టులోని మురికి పోతుంది
వ్యాయామం చేయడం వల్ల విపరీతమైన చెమట బయటికి వస్తుంది. దీనివల్ల తలపై మురికి పేరుకుపోతుంది. అంతేకాదు తలలోని రంధ్రాలు మూసుకుపోతాయి. ఈ కారణంగా జుట్టు రాలడం సమస్య ప్రారంభమవుతుంది. ఈ సమస్యని నివారించడానికి ప్రతిరోజూ జుట్టును కడగాలి. దీని వల్ల తలపై బ్యాక్టీరియా సమస్య ఉండదు.
2. చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి
వ్యాయామం చేయడం వల్ల వచ్చే చెమట చర్మ రంధ్రాలను మూసివేస్తుంది. దీనివల్ల జుట్టుకి సరిపడ పోషణ లభించదు. ఈ కారణంగా జుట్టు రాలుతుంది. వ్యాయామం తర్వాత జుట్టు కడగడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. రక్త సరఫరా సాఫీగా సాగుతుంది.
3. చుండ్రు సమస్య దూరమవుతుంది.
వ్యాయామం తర్వాత జుట్టు కడగడం వల్ల చుండ్రు సమస్యను అధిగమించవచ్చు. చెమటలు పట్టడం వల్ల జుట్టులో చుండ్రు సమస్య ఏర్పడుతుంది. అందుకే వ్యాయామం తర్వాత జుట్టును కడగాలి.
4. రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది
వ్యాయామం చేసిన జుట్టు కడగడం వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది మీ జుట్టు పెరుగుదలను పెంచుతుంది. కాబట్టి వ్యాయామం తర్వాత జుట్టును కడగడం మరిచిపోవద్దు.