H3N2 Fever: జ్వరానికి మందులు వాడుతున్నారా.. ఆరోగ్యానికి హాని ఎందుకంటే..?
H3N2 Fever: ప్రస్తుతం దేశంలో H3N2 వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే దీనికారణంగా ఐదుగురు వ్యక్తులు మరణించారు.
H3N2 Fever: ప్రస్తుతం దేశంలో H3N2 వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే దీనికారణంగా ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఈ వైరస్ వల్ల చాలామంది జ్వారానికి గురవుతున్నారు. అయితే చాలామంది ప్రజలు సొంతంగా మందులు తీసుకుంటున్నారు. కానీ ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. తేలికపాటి జ్వరం వచ్చినప్పుడు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నయం చేస్తుందని కొత్త అధ్యయనంలో తేలింది. ఇలాంటి సమయంలో ఎటువంటి ఔషధం తీసుకోకపోవడమే ఉత్తమం.
పరిశోధన ప్రకారం జ్వరంవల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై బ్యాక్టీరియా లేదా వైరస్ దాడి చేస్తుంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. ఈ సందర్భంలో ఔషధం తీసుకుంటే ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. ఎవరికైనా తేలికపాటి జ్వరం ఉన్నప్పుడు వారు స్వయంగా కోలుకోవడానికి అనుమతించాలి. వెంటనే మందులు వేసుకోకూడదు.
తేలికపాటి జ్వరం
పరిశోధన ప్రకారం తేలికపాటి జ్వరం శరీరంలోని ఇన్పెక్షన్ తొలగించడానికి ఒక సంకేతమని చెప్పవచ్చు. దీని నుంచి కణజాలాలు, కణాలు కోలుకుంటాయి. శరీరాన్ని దాని పనిని అది చేయడానికి మనం అనుమతించాలి. తేలికపాటి జ్వరంలో యాంటీబయాటిక్ ఔషధం తీసుకోకూడదు. ఈ మందులు రోగనిరోధక వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతాయి. చాలా సందర్భాల్లో మందులు తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని కారణంగా, మందులు శరీరంపై ప్రభావం చూపడం మానేస్తాయి. ఈ సందర్భంలో రోగి పరిస్థితి మరింత దిగజారుతుంది.
దుష్ప్రభావాలు
తేలికపాటి జ్వరం వచ్చినప్పుడు మందులు తీసుకోవడానికి ప్రజలు మెడికల్ స్టోర్‌కు వెళతారు. ఇది వారికి సౌకర్యాన్ని ఇస్తుంది కానీ ఇది ఆరోగ్యానికి హానికరం. తేలికపాటి జ్వరం శరీరానికి మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఇన్‌ఫ్లుఎంజా, కోవిడ్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ రెండు వైరస్‌లలో తేలికపాటి జ్వరం ఉంటుంది. దీనితో పాటు దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉంటున్నాయి. ఒక వ్యక్తికి మూడు రోజులకు పైగా ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.