Foot Pain: తరచుగా పాదాల నొప్పి వేధిస్తుందా..!
Foot Pain: పాదాలలో తరచుగా నొప్పి రావడం ఒక సాధారణ సమస్య. గతంలో వృద్ధులు మాత్రమే ఈ సమస్యను ఎదుర్కొనేవారు.
Foot Pain: పాదాలలో తరచుగా నొప్పి రావడం ఒక సాధారణ సమస్య. గతంలో వృద్ధులు మాత్రమే ఈ సమస్యను ఎదుర్కొనేవారు. కానీ ఇప్పుడు అన్ని వయసుల వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ నొప్పి చాలా కాలం పాటు కొనసాగితే నడవడం చాలా కష్టమవుతుంది. దీన్ని అధిగమించడానికి మీరు నొప్పి నివారణ మాత్రలు వేసుకోవచ్చు. కానీ ఇది కొంత సమయం వరకే ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని ఇంటి నివారణల ద్వారా ఈ నొప్పిని పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
1. ఐస్‌క్యూబ్స్
పాదాల నొప్పి ఉన్నప్పుడు కోల్డ్ ప్యాక్ ప్రయత్నించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వాపును తగ్గిస్తుంది. కొన్ని ఐస్ క్యూబ్‌లని తీసుకొని వాటిని ఒక సన్నని క్లాత్‌లో చుట్టి నొప్పి ఎక్కువగా ఉన్నచోట రోజుకు రెండుసార్లు మసాజ్ చేయాలి. మంచి ఉపశమనం ఉంటుంది.
2. ఆయిల్ మసాజ్
సీజన్‌ను బట్టి నూనెను ఎంచుకుని మసాజ్ చేస్తే నొప్పి తగ్గుతుంది. వాపులు ఉన్నచోట కాకుండా దాని చుట్టూ మసాజ్ చేయాలి. శీతాకాలం వస్తోంది కాబట్టి ఆవాల నూనెతో మసాజ్ చేస్తే చాలా మంచిది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
3. పసుపు పాలు
పాదాల నొప్పి పరిమితికి మించి వస్తే పసుపు పాలు తాగితే మంచిది. ఇందులో ఉండే ఔషధ గుణాల వల్ల మీరు చాలా ప్రయోజనం పొందుతారు. పసుపులో అనేక యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి.
4. మెగ్నీషియం ఆహారం
మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి. తద్వారా పాదాల నొప్పి పునరావృతం కాదు. అరటిపండ్లు, వాల్‌నట్‌లు, పచ్చి కూరగాయలు వంటివి తినాలి.