Vegetarian: శాకాహారులుగా మారితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
Vegetarian: మాంసహారుల కంటే శాకాహారులు ఎక్కువ రోజులు బతుకుతారని ఒక నివేదికలో వెల్లడైంది
Vegetarian: మాంసహారుల కంటే శాకాహారులు ఎక్కువ రోజులు బతుకుతారని ఒక నివేదికలో వెల్లడైంది. ఇందులో ఎంత నిజం ఉందో మనకు తెలియదు కానీ శాకాహారులుగా మారితే మాత్రం చాలా ప్రయోజనాలున్నాయి. ఈ విషయం తెలుసుకున్న చాలామంది ఇప్పుడు శాకాహారులుగా మారుతున్నారు. జంతువులను చంపి తినడం కంటే ఆకు కూరలు, కూరగాయలు తినడం మేలని భావిస్తున్నారు. తేలికగాగ జీర్ణమయ్యే ఆహారం తింటే మంచిదని ఫీలవుతున్నారు. అయితే శాకాహారులుగా మారితే ఎన్ని ప్రయోజనాలున్నాయో ఒక్కసారి తెలుసుకుందాం.
గుండె సమస్యలు దరిచేరవు
శాఖాహార ఆహారం స్ట్రోక్ వంటి గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు లివర్ చెడిపోకుండా రక్షిస్తుంది.
విటమిన్లు, ప్రోటీన్లు
శాకాహారంలో కూడా మాంసాహారంలో దొరికే విటమిన్లు, ప్రొటీన్లను తీసుకోవచ్చు. అంతేకాదు మాంసాహారం వల్ల చెడు కొలస్ట్రాల్ ఎక్కువగా పెరుగుతుంది. కానీ మొక్కల తిండి తింటే ఈ సమస్య ఉండదు. అంతేకాదు నిత్యం యవ్వనంగా ఉండవచ్చు.
సుదీర్ఘ మైన జీవితం
శాకాహారం తీసుకుంటే సుదీర్ఘ మైన జీవితాన్ని గడపవచ్చు. అంతేకాదు ఆరోగ్యంగా ఉంటారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురించబడిన కథనం ప్రకారం శాకాహారుల కంటే మాంసాహారులలో వృద్ధాప్య ఛాయలు తొందరగా కనిపిస్తాయని తేల్చారు. అంతేకాదు వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
బరువు నియంత్రణ
అధ్యయనాల ప్రకారం శాఖాహారం బరువు సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొవ్వు నిల్వ ఉండకుండా చూసుకుంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో బరువు పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.