Health Tips: స్టామినా తక్కువగా ఉందా.. పెంచుకోవడానికి ఇవి తీసుకోండి..!

* మీరు ఈ పరిస్థితిని ఎదుర్కొంటుంటే వెంటనే స్టామినా పెంచే ఆహారాలని తీసుకోవాలి.

Update: 2022-11-17 03:04 GMT

స్టామినా తక్కువగా ఉందా.. పెంచుకోవడానికి ఇవి తీసుకోండి

Health Tips: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. ఇందులో కొంతమంది ఉత్సాహంతో జిమ్‌లో కూడా చేరుతారు. కానీ కొన్ని రోజులకే వదిలివేస్తారు. దీనికి కారణం వారిలో స్టామినా తక్కువగా ఉండటమే. శరీరంలో స్టామినా లేకపోతే వ్యాయామం చేస్తున్నప్పుడు శ్వాస త్వరగా వస్తుంది. మీరు ఈ పరిస్థితిని ఎదుర్కొంటుంటే వెంటనే స్టామినా పెంచే ఆహారాలని తీసుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బాదం:

బాదంలో పోషకాలు మెండుగా ఉంటాయి. బాదంపప్పును రోజూ తీసుకోవడం వల్ల స్టామినా పెరుగుతుంది. అంతేకాదు ఎముకలు బలంగా తయారవుతాయి. ఇది కాకుండా రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది.

అరటిపండు:

బరువు పెరిగే విషయానికి వస్తే ముందుగా అరటిపండు పేరు గుర్తుకువస్తుంది. అయితే ఇందులో ఉండే ఫైబర్, నేచురల్ షుగర్ స్టామినాను పెంచడంలో సహాయపడుతాయి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ బి ఇందులో ఉంటాయి. ఇవి శరీరానికి ఎక్కువ కాలం శక్తిని అందిస్తాయి.

కాఫీ:

శరీర అలసటను తొలగించడానికి కాఫీ ఉత్తమమని చెప్పవచ్చు. కాఫీ తీసుకోవడం వల్ల స్టామినా పెరుగుతుందని తెలిస్తే అందరు ఆశ్చర్యపోతారు. కాఫీ తీసుకోవడం ద్వారా శరీరం నుంచి అడ్రినలిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది కండరాలలో రక్తాన్ని వేగంగా పంపింగ్ చేయడంలో సహాయపడుతుంది. అందుకే జిమ్‌కు వెళ్లేవారు రోజూ 2 కప్పుల కాఫీ తాగాలి.

Tags:    

Similar News