Health Tips: జ్ఞాపకశక్తి తక్కువగా ఉందా.. ఈ నట్స్ ట్రై చేయండి నెలరోజుల్లో రిజల్ట్..!
Health Tips: నేటికాలంలో చాలామందిలో జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. మతిమరుపు ఎక్కువైపోతుంది.
Health Tips: నేటికాలంలో చాలామందిలో జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. మతిమరుపు ఎక్కువైపోతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికి చికిత్స తీసుకోవడం వల్ల సరైన ఫలితాలు ఉండవు. కానీ డైట్‌లో మార్పు చేస్తే త్వరగా ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సహజసిద్దంగా జ్ఞాపకశక్తి పెంచే కొన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి. వాటిని డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. అందులో ఒకటి పిస్తాపప్పు. దీని రుచి చాలామందిని ఆకర్షిస్తుంది. దీనిని స్వీట్ల తయారీలో వాడుతారు. దీని మరిన్ని ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
బరువు తగ్గుతారు
పిస్తాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. ఇది ఊబకాయాన్ని తగ్గించడమే కాకుండా గుండె జబ్బుల వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమైన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
కంటి ఆరోగ్యం
పిస్తాలో లుటీన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.
జ్ఞాపకశక్తి పెరుగుదల
జ్ఞాపకశక్తి బలహీనంగా ఉన్నవారు లేదా జ్ఞాపకశక్తి కోల్పోయే సమస్యను ఎదుర్కొంటున్నవారు పిస్తాపప్పులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇది మైండ్‌ని షార్ప్‌గా చేయడంలో సహాయపడుతుంది.
క్యాన్సర్ నివారణ
పిస్తాపప్పులో పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. అందుకే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడుతాయి.
పిస్తాలో ఉండే పోషకాలు
పిస్తాపప్పులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఫోలేట్, ప్రొటీన్లు, రాగి, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి మినరల్స్ ఉంటాయి. అంతేకాదు క్యాల్షియం, థయామిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్ని రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి.