Health Tips: నిద్ర లేవగానే ఆయాసం వస్తుందా.. ఈ కారణాలని విస్మరించవద్దు..!

Health Tips: అయితే నిద్ర లేవగానే కొన్ని కారణాల వల్ల అలసట వస్తుంది. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

Update: 2023-07-12 01:30 GMT

Health Tips: నిద్ర లేవగానే ఆయాసం వస్తుందా.. ఈ కారణాలని విస్మరించవద్దు..!

Health Tips: చాలామంది రోజు మొత్తం పనిచేసి తీవ్రంగా అలసిపోతారు. హార్డ్‌వర్క్‌ చేస్తారు కాబట్టి అలసిపోవడం సహజమే. కానీ కొంతమంది ఉదయం నిద్రలేవగానే ఆయాస పడుతారు. ఇది కొన్ని వ్యాధులకి సంకేతమని గుర్తుంచుకోండి. ఇలా చాలా రోజుల నుంచి జరిగినట్లయితే దీని వెనుక ఉన్న కారణాలని తెలుసుకోవాలి. అస్సలు విస్మరించకూడదు. వెంటనే వైద్యుడిని దగ్గరికి వెళ్లి టెస్టులు చేయించుకోవాలి. అయితే నిద్ర లేవగానే కొన్ని కారణాల వల్ల అలసట వస్తుంది. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

సమయానికి నిద్రపోకపోవడం

ప్రతి ఒక్కరికి భిన్నమైన జీవనశైలి ఉంటుంది. కొంతమంది త్వరగా నిద్రపోవడానికి ఇష్టపడితే మరికొంతమంది రాత్రంతా మేల్కొని ఉండటానికి ఇష్టపడతారు. అయితే జీవనశైలికి విరుద్దంగా ప్రవర్తిస్తే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అందుకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. లేదంటే నీరసం, బలహీనత వంటి ఇతర సమస్యలు ఎదురవుతాయి.

చాలాసేపు పడుకోవడం

కొంతమంది ఉదయం పూట మెలకువ వచ్చినా మంచం మీద నుంచి లేవరు. ఇది బద్దకానికి దారితీస్తుంది. ఇది నీరసం, బలహీనతని కలిగిస్తుంది. అలారంని పదే పదే ఆఫ్ చేయడం మంచిది కాదు. ఇది చిరాకు, అలసటకు కారణమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఉదయమే నిద్రలేచే అలవాటు చేసుకోవాలి.

పడకగది వాతావరణం

పడకగదిలో నిద్రని ప్రభావితం చేసే కొన్ని అంశాలు ఉంటాయి. ముఖ్యంగా నిద్రపోవడానికి గది ఉష్ణోగ్రత అనుకూలంగా ఉండాలి. ఎక్కువ ఉండకూడదు మరీ తక్కువ ఉండకూడదు. ఎక్కువ వెలుతురు వచ్చే లైట్లు ఉండకూడదు. గోడలకి బలమైన రంగులు కాకుండా లైట్‌ కలర్స్‌ వేయాలి. మంచి నిద్ర కోసం ఏసీ కూలింగ్‌ని సర్దుబాటు చేసుకోవాలి.

ఆహారం, పానీయం

ఆల్కహాల్, కెఫిన్‌కు దూరంగా ఉండాలి. వీటివల్ల నిద్ర సమస్యలు ఎదురవుతాయి. ఉదయం అలసిపోయినట్లు అనిపిస్తుంది. అందుకే నిద్రకు 3 గంటల ముందు కెఫిన్‌కు సంబంధించిన పానీయాలని తాగకూడదు. ఇక ఆల్కహాలో శరీరానికి అన్ని విధాల నష్టాన్ని కలిగిస్తుంది.

Tags:    

Similar News