Tea Side Effects: రోజులో ఎక్కువ సార్లు టీ తాగుతున్నారా.. సమస్యలను కొని తెచ్చుకున్నట్లే..!
Tea Side Effects: నేటి రోజుల్లో చాలామంది టీకి బానిసలుగా మారారు. ఉదయం నిద్రలేచిన వెంటనే టీతో రోజును ప్రారంభించే వాళ్లు చాలామంది ఉన్నారు.
Tea Side Effects: నేటి రోజుల్లో చాలామంది టీకి బానిసలుగా మారారు. ఉదయం నిద్రలేచిన వెంటనే టీతో రోజును ప్రారంభించే వాళ్లు చాలామంది ఉన్నారు. ఇండియాలో వాటర్ తర్వాత ఎక్కువగా తాగే పానీయం టీ మాత్రమే. కార్పొరేట్ కార్యాలయాల నుంచి గల్లీలో పనిచేసే కార్మికుల దాకా ప్రతి ఒక్కరూ టీ తాగుతారు. కానీ టీ పట్ల మీకున్న మక్కువ మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. అతిగా టీ తాగడం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
టీ వల్ల ఐరన్ లోపమా?
టీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే టానిన్ ఐరన్ శోషణను నిరోధిస్తుంది. ఐరన్ లోపం వల్ల శరీరంలో బలహీనత, అలసట, నిద్రలేమి, అనేక ఇతర సమస్యలు పెరుగుతాయి. టీ లో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది విశ్రాంతి లేకపోవడం, నిద్ర లేకపోవడం, వికారం, వంటి దుష్ప్రభావాలకు కారణమవుతుంది.
జీర్ణ సమస్యలు
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది జీర్ణశక్తిని ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియ మందగిస్తుంది.
గుండెల్లో మంట
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గుండెల్లో మంట పుడుతుంది. దీని కారణంగా ఆహార నాళంలో యాసిడ్ ఏర్పడి యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలతో పాటు పుల్లని తేన్పులు, వికారం కలుగుతాయి.
నిద్ర సమస్యలు
చాలా మంది వ్యక్తులు రాత్రి నిద్రపోయే ముందు టీ తాగుతారు. ఇది వారి నిద్రపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. ఇది రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన సమస్యను కలిగిస్తుంది. రాత్రి పడుకునే ముందు టీ తాగకూడదు. ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగిన తర్వాత మాత్రమే నిద్రించాలి.
పేగులపై ప్రభావం
టీ మన పేగులపై చెడు ప్రభావం చూపుతుంది. ఎక్కువగా టీ తీసుకునే వ్యక్తులు కెఫిన్, టానిన్‌ల కారణంగా ఆందోళన, ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు.