Paracetamol : పారాసెటమాల్ తో కలిపి ఈ మందులు అస్సలు వేసుకోవద్దు..లిస్టు చూసి జాగ్రత్త పడండి..!
Paracetamol : భారత ప్రభుత్వం 14 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డిసి) మందులను ప్రమాదకరం అనే కారణంతో మార్కెట్ నుంచి నిషేధించింది.
Paracetamol : మందులు వేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని రకాల కాంబినేషన్లో ఉన్న మందులను మీరు తీసుకున్నట్లయితే అవి ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం కూడా అలాంటి కాంబినేషన్లను గుర్తించి మార్కెట్ నుంచి ఆ మందులను నిషేధించింది.ముఖ్యంగా భారత ప్రభుత్వం 14 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డిసి) మందులను ప్రమాదకరం అనే కారణంతో మార్కెట్ నుంచి నిషేధించింది. వీటిలో నిముసులైడ్ , పారాసెటమాల్ డిస్పర్సిబుల్ మాత్రలు, క్లోఫెనిరమైన్ మెలేట్, కోడైన్ సిరప్ ఉన్నాయి.ఈ మందుల పంపిణీ,తయారీ,విక్రయాలపై సైతం నిషేధం విధించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసి నిషేధిత మందుల జాబితాను ప్రకటించింది.
వైద్య నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా,కేంద్ర ప్రభుత్వం 14 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్‌లను నిషేధించింది.వాటిలో జ్వరం,తలనొప్పి,మైగ్రేన్,కండరాల నొప్పి,పంటి నొప్పి,కీళ్లనొప్పులు,స్పాండిలైటిస్,ఆస్టియో ఆర్థరైటిస్,పీరియడ్స్ నొప్పి వంటి వాటికి వాడే నిమెసులైడ్, పారాసెటమాల్ కాంబినేషన్ కలిగిన టాబ్లెట్లు ఉన్నాయి.ఈ నిషేధిత ఔషధాలను రెగ్యులర్ గా వాడినట్లయితే కాలేయం,మూత్రపిండాలు,గుండెకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నిజానికి ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్ అనేవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.కాబట్టి,ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వీటిని నిషేధించినట్లు,అధికారులు పేర్కొంటున్నారు.కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940 కింద నిషేధ నోటిఫికేషన్ జారీ చేసింది.
నిషేధించిన మందుల కాంబినేషన్ లిస్టులో నిమెసులైడ్ + పారాసెటమాల్ డిస్పర్సిబుల్ టాబ్లెట్‌లు, క్లోఫెనిరమైన్ మలేట్ + కోడైన్ సిరప్, ఫోల్‌కోడిన్ + ప్రోమెథాజైన్, అమోక్సిసిలిన్ + బ్రోమ్‌హెక్సిన్ , బ్రోమ్‌హెక్సిన్ + డెక్స్‌ట్రోమెథార్ఫాన్ + అమ్మోనియం క్లోరైడ్ + మెంతోల్, పారాసెటమాల్ + గ్లుఫెన్ + గ్లుఫ్‌హెక్సిన్ ఉన్నాయి.ఈ కాంబినేషన్ మాత్రలు మార్కెట్లో మీకు ఎక్కడైనా లభిస్తే వెంటనే డ్రగ్ అథారిటీ అధికారులకు తెలపడం మంచిది.తద్వారా వీటి వినియోగం నుంచి ప్రజలను కాపాడుకోవచ్చు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.