పొలం గట్లపై పొరపాటున కూడా ఈ చెట్లు నాటవద్దు.. పంట మొత్తం నాశనం..!

* పొలం గట్లపై పొరపాటున కూడా ఈ చెట్లు నాటవద్దు.. పంట మొత్తం నాశనం..!

Update: 2023-01-14 01:30 GMT

పొలం గట్లపై పొరపాటున కూడా ఈ చెట్లు నాటవద్దు.. పంట మొత్తం నాశనం..!

Eucalyptus Side Effects:వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం కోసం రైతులు పొలం గట్లపై వివిధ జాతుల చెట్లను నాటుతారు. ఈ చెట్లు ఒకటిన్నర సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలలో పెరుగుతాయి. ఈ చెట్ల కలపని మార్కెట్‌లో అధిక ధరలకి విక్రయించి రైతులు పెద్ద మొత్తంలో సంపాదిస్తారు. అయితే కొన్ని చెట్లని నాటడం వల్ల లాభాలకి బదులు నష్టమే జరుగుతుంది. ఈ చెట్లు భూమిని మొత్తం నాశనం చేస్తాయి. అటువంటి వాటిలో యూకలిప్టస్ ఒకటి. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

వృక్షశాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం యూకలిప్టస్ 5 సంవత్సరాల తరువాత దాని పూర్తి రూపాన్ని సంతరించుకుంటుంది. ఇది 25నుంచి 30 అడుగుల వరకు పెరుగుతుంది. దీని కలపకి మార్కెట్‌లో మంచి ధరలు ఉన్నాయి. కానీ ఈ చెట్టు సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఇది భూమిలో ఉన్న నీరు, పోషకాలను దోపిడీ చేస్తుంది. భూమిని బంజరుగా మారుస్తుంది. ఈ చెట్టుకు ప్రతిరోజూ 12 లీటర్ల నీరు, చాలా పోషకాలు అవసరం. సరిపడ నీరు అందుబాటులో లేనప్పుడు దాని మూలాలు భూగర్భ జలాలను పీల్చుకోవడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా ఆ ప్రాంతం భూగర్భ జలమట్టం పడిపోతుంది.

పలు ప్రాంతాల్లో నిషేధం పర్యావరణానికి సంబంధించి అనేక నివేదికలలో యూకలిప్టస్ సాగు చేసే ప్రాంతాలలో, భూగర్భజల మట్టం చాలా దిగువకు చేరుకున్నట్లు కనుగొన్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అటువంటి ప్రాంతాలను డేంజర్ జోన్‌లుగా ప్రకటించి అక్కడ యూకలిప్టస్‌ చెట్లను నాటడాన్ని నిషేధించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రకారం ఈ చెట్లను నాటిన తర్వాత ఆ నేల ఇతర వ్యవసాయానికి పనికిరాదు. ఈ భూమిలోని పోషకాలు వృధా అవుతాయి.

నివేదిక ప్రకారం ఈ చెట్లని మొదటగా బ్రిటీష్ వారు ప్రారంభించారు. చిత్తడి నేలలు, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను ఆరబెట్టడానికి యూకలిప్టస్ చెట్లను నాటడం ప్రారంభించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నీరు, తేమ ఆవిరైపోయేవి. ఈ చెట్టు పొడవు మిగిలిన చెట్ల కంటే చాలా ఎక్కువ దీని కారణంగా పెద్ద మొత్తంలో కలప వస్తుంది. ఇది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. కానీ నేటి కాలంలో భూగర్భజలాలు చాలా తక్కువ స్థాయికి చేరుకున్నప్పుడు ఈ చెట్లు నాటడం వల్ల లాభానికి బదులు నష్టమే జరుగుతుంది.

Tags:    

Similar News