Green Tea: గ్రీన్‌ టీ విషయంలో ఈ తప్పులు చేయవద్దు.. ప్రయోజనానికి బదులు హాని..!

Green Tea: బరువు తగ్గడానికి చాలామంది గ్రీన్‌ టీ తాగాలని సూచిస్తారు.

Update: 2023-05-31 01:30 GMT

Green Tea: గ్రీన్‌ టీ విషయంలో ఈ తప్పులు చేయవద్దు.. ప్రయోజనానికి బదులు హాని..!

Green Tea: బరువు తగ్గడానికి చాలామంది గ్రీన్‌ టీ తాగాలని సూచిస్తారు. దీనివల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అదేవిధంగా చాలా నష్టాలు కూడా ఉన్నాయి. అందుకే దీని విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. కొంతమంది ఆరోగ్య నిపుణులు ఉదయం లేచిన తర్వాత గ్రీన్ టీ తాగాలని సూచిస్తారు. దీనివల్ల చాలామంది ఉదయమే గ్రీన్‌ టీ తాగుతారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తాయి. అయితే దీనిని తయారుచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

పరగడుపున గ్రీన్ టీ

ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం చాలా హానికరం. ఇందులో ఉండే టానిన్లు కడుపులో చికాకు, అజీర్ణానికి కారణమవుతాయి. ఇది కడుపులో గ్యాస్, అసిడిటీ, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం మానుకోవడం ఉత్తమం. భోజనం తర్వాత లేదా భోజనం తర్వాత రెండు గంటల తర్వాత గ్రీన్‌ టీ తాగాలి.

గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల

గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇందులో ఉండే కెఫిన్ గుండె కొట్టుకోవడం, నిద్రలేమి వంటి సమస్యలను కలిగిస్తుంది. బరువు తగ్గడానికి గ్రీన్ టీని తీసుకుంటే దానిని తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోండి.

రాత్రిపూట గ్రీన్ టీ

రాత్రిపూట గ్రీన్ టీ తాగడం వల్ల నిద్రపై ప్రభావం పడుతుంది. ఇందులో ఉండే కెఫిన్ ఒత్తిడిని పెంచుతుంది. మిమ్మల్ని విశ్రాంతి తీసుకోనివ్వదు. మీరు మళ్లీ మళ్లీ కళ్లు తెరుస్తూ ఉండేలా చేస్తుంది. అంతేకాదు తల తిరిగే సమస్యలు వస్తాయి. అలాగే గ్రీన్ టీలో ఉండే టానిన్ ఆహారంలో ఉండే పోషకాలను జీర్ణం చేయడంలో సహాయపడదు. దీనివల్ల రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడుతుందని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News