Running: రన్నింగ్‌ తర్వాత ఈ తప్పులు అస్సలు చేయకూడదు..!

Running: నేటి కాలంలో ప్రజలు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి అనేక రకాల వ్యాయామాలు చేస్తుంటారు.

Update: 2022-06-18 14:30 GMT

Running: రన్నింగ్‌ తర్వాత ఈ తప్పులు అస్సలు చేయకూడదు..!

Running: నేటి కాలంలో ప్రజలు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి అనేక రకాల వ్యాయామాలు చేస్తుంటారు. అందులో రన్నింగ్‌ చేసేవాళ్లు చాలామంది ఉంటారు. ఇది మీ శరీరం శక్తిని పెంచడమే కాకుండా బాడీని సరైన ఆకృతిలో ఉంచుతుంది. మీరు రన్నింగ్ ద్వారా కేలరీలను సులభంగా బర్న్ చేయవచ్చు. అయితే కొంతమంది రన్నింగ్ తర్వాత కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని వల్ల వారి కష్టమంతా వృధా అవుతుంది. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

రీహైడ్రేట్ చేయవద్దు

రన్నింగ్ తర్వాత శరీరాన్ని రీహైడ్రేట్ చేయడం చాలా ముఖ్యం. సాధారణంగా ప్రజలు శరీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి నీటిని తీసుకుంటారు. అయితే నీళ్లతో పాటు కొబ్బరి నీళ్లు తీసుకుంటే చాలా మంచిది.

శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోవడం

మీరు వ్యాయామం చేసినప్పుడు శరీరం చాలా ఒత్తిడికి లోనవుతుంది. ఈ పరిస్థితిలో శరీరానికి విరామం అవసరం. అందువల్ల రన్నింగ్‌తో పాటు మీ సౌలభ్యంపై కూడా శ్రద్ధ వహించండి. దీని కోసం మీరు తగినంత నిద్ర పోవాలి. మీరు రాత్రిపూట కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని గుర్తుంచుకోండి. కావాలంటే మీరు ప్రతిరోజూ వ్యాయామాలను మార్చవచ్చు.

పరుగెత్తిన వెంటనే పని చేయకూడదు

పరుగెత్తిన వెంటనే నీరు లేదా నిమ్మరసం తాగి ఏదైనా పనిచేయడం అలవాటుగా మారుతుంది. ఇలా చేయడం కరెక్ట్‌ కాదు. వ్యాయామం తర్వాత ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని స్నాక్స్‌గా తీసుకోవాలి.

చల్లటి నీటితో స్నానం చేయండి

అలసటని ఎదుర్కోవడానికి మీరు చల్లటి నీటితో స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మీరు రిలాక్స్‌ అవుతారు. అయితే పరుగెత్తిన వెంటనే చేయకూడదు. కొంత సమయం తర్వాత చేస్తే ఆరోగ్యానికి మంచిది.

Tags:    

Similar News