Health Tips: శరీరంలో సి విటమిన్ లోపం ఉండవద్దు.. గుండె, కాలేయం ప్రమాదంలో పడుతాయి..!
Health Tips: శరీరం సరైన విధానంలో పనిచేయడానికి చాలా రకాల విటమిన్లు అవసరమవుతాయి. ఇవి లోపించినట్లయితే రకరకల వ్యాధులు సంభవిస్తాయి.
Health Tips: శరీరం సరైన విధానంలో పనిచేయడానికి చాలా రకాల విటమిన్లు అవసరమవుతాయి. ఇవి లోపించినట్లయితే రకరకల వ్యాధులు సంభవిస్తాయి. విటమిన్లలో అత్యంత ప్రధానమైనది సి విటమిన్. ఇది లోపిస్తే శరీర అవయవాల పనితీరు దెబ్బతింటుంది. ఎందుకంటే ఇది ప్రధానంగా రోగనిరోధక శక్తికి సంబంధించినది. విటమిన్ సి లోపించడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఈ రోజు తెలుసుకుందాం.
క్లోమం
జీర్ణక్రియ ప్రక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో క్లోమగ్రంథి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో విటమిన్ ఎ, సి, ఇ యాంటీఆక్సిడెంట్ల లోపం ఉంటే అది క్లోమంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా శరీరంలో ఫ్రీ రాడికల్స్ సంఖ్య వేగంగా పెరుగుతుంది. దీంతో క్లోమం దెబ్బతింటుంది అది క్రమంగా క్షీణించడం మొదలవుతుంది.
హార్ట్ ఫెయిల్యూర్
శరీరంలో విటమిన్ సి లోపం ఉండటం వల్ల గుండెపై ప్రభావం పడుతుంది. నిజానికి విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎక్కువ కాలం విటమిన్ సి లోపం ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఇతరులకన్నా ఎక్కువగా పెరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు కూడా పోతాయి.
లివర్ ఫెయిల్యూర్
వైద్యుల ప్రకారం శరీరంలో విటమిన్ సి లోపం కారణంగా శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల కాలేయం దెబ్బతినడం మొదలవుతుంది. ఇదే పరిస్థితి చాలా రోజులు కొనసాగితే లివర్ ఫెయిల్యూర్ జరుగుతుంది. దీనివల్ల రోగికి అకాల మరణం సంభవిస్తుంది. దీన్ని నివారించడానికి విటమిన్ సి పెంచే పండ్లను తినడం చాలా ముఖ్యం.