Turmeric: పరిమితికి మించి పసుపు వాడుతున్నారా.. ఈ విషయాలపై ఓ లుక్కేయండి..!
Turmeric Side Effects: పసుపు భారతదేశంలోని ప్రతి ఇంటిలో సులభంగా దొరుకుతుంది.
Turmeric Side Effects: పసుపు భారతదేశంలోని ప్రతి ఇంటిలో సులభంగా దొరుకుతుంది. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేద మందుల తయారీలో వాడుతున్నారు. అంతేకాదు ఇందులో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. గాయాలు మానడానికి పసుపుని ఉపయోగిస్తారు. గర్భిణులు రాత్రిపూట పాలలో కొద్దిగా పసుపుని వేసుకొని తాగుతారు. పసుపు యాంటి బయాటిక్‌గా పనిచేస్తుంది. ఇది అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. అయితే ఏదైనా అతిగా తీసుకుంటే హానికరమే. అలాగే పసుపుని ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం.
కిడ్నీలో రాళ్లు
పసుపును పరిమిత పరిమాణంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఎక్కువగా తీసుకుంటే అందులో ఉండే ఆక్సలేట్ మన శరీరంలో రాళ్లను సృష్టిస్తుంది. అందువల్ల తినే ముందు దాని పరిమాణం గురించి తెలుసుకుంటే మంచిది.
విరేచనాలు
తరచుగా బయటి ఆహారం తినడం వల్ల కొంతమందికి విరేచనాలు సరిగ్గా జరగవు. అయితే పసుపు ఈ సమస్యను మరింత జఠిలం చేస్తుంది. ఎందుకంటే ఇందులో యోగిక్ కర్కుమిన్ ఉంటుంది. ఇది ఈ సమస్యని పెంచుతుంది.
ఐరన్ లోపం
నేటి ఆహారం వల్ల మన శరీరానికి అవసరమైనంత విటమిన్లు, మినరల్స్, ఐరన్ లభించడంలేదు. దీంతో వ్యాధులకి గురికావాల్సి వస్తోంది. శరీరంలో ఐరన్ తక్కువగా ఉండటం వల్ల రక్తహీనతకి గురవుతున్నారు. పసుపును అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే ఐరన్ పొడిబారుతుంది. దీని వల్ల బలహీనతతో పాటు ఇతర సమస్యలు తలెత్తుతాయి.