Health Tips: వర్షాకాలం ఈ ఆహారాలు తినవద్దు.. ఇమ్యూనిటి పవర్‌ని తగ్గిస్తాయి..!

Health Tips: వర్షాకాలంలో రోగాల బెడద ఎక్కువగా ఉంటుంది. అనేక వ్యాధులు రోజుల తరబడి పట్టి పీడిస్తాయి. ఈ పరిస్థితిలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి.

Update: 2023-07-20 15:00 GMT

Health Tips: వర్షాకాలం ఈ ఆహారాలు తినవద్దు.. ఇమ్యూనిటి పవర్‌ని తగ్గిస్తాయి..!

Health Tips: వర్షాకాలంలో రోగాల బెడద ఎక్కువగా ఉంటుంది. అనేక వ్యాధులు రోజుల తరబడి పట్టి పీడిస్తాయి. ఈ పరిస్థితిలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. లేదంటే అనారోగ్యానికి గురికావాల్సి ఉంటుంది. కానీ చాలామంది ఈ సీజన్‌లో ఒక పెద్ద తప్పు చేస్తారు. ఈ కారణంగా ఆస్పత్రి పాలవుతారు. అదేంటంటే శరీరం నుంచి రోగనిరోధక శక్తిని బయటికి పంపే ఆహారాలు ఎక్కువగా తింటారు. దీంతో ఇమ్యూనిటీ పవర్‌ తగ్గి రోగాల బారిన పడుతారు. అందుకే వర్షాకాలంలో ఎలాంటి ఆహారాలకి దూరంగా ఉండాలో ఈరోజు తెలుసుకుందాం.

చక్కెర పదార్థాలు

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలంటే చక్కెర పదార్థాలకి దూరంగా ఉండాలి. ఇందులో ఐస్ క్రీం, కేక్, క్యాండీ, చాక్లెట్, కూల్‌డ్రింక్స్‌ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఇమ్యూనిటీ పవర్‌ బలంగా ఉండాలంటే తీపి పదార్థాలు తినవద్దు.

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. చాలామంది ప్యాక్‌ చేసిన ఆహారాలని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. కానీ ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. అధిక ఉప్పు ఆటో ఇమ్యూన్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.

కొవ్వు ఆమ్లం

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ రెండూ శరీరానికి అవసరం. కానీ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ శరీరంలో ఎక్కువగా ఉంటే రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. అందువల్ల రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండకూడదంటే ఒమేగా -6 కలిగి ఉన్న వాటికి దూరంగా ఉండాలి.

ఆల్కహాల్, ధూమపానం

ఆల్కహాల్‌, ధూమపానం చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం. వీటివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇవి రెండు రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతాయి. శరీరాన్ని బలహీనంగా మారుస్తాయి. అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉంటే మేలు.

Tags:    

Similar News