Health Tips: బీర్‌ తాగిన తర్వాత వీటిని ముట్టవద్దు.. లేదంటే మూల్యం చెల్లించాల్సిందే..!

Health Tips: వేసవి సీజన్‌లో ఎండ మండిపోతుంది. దీంతో చల్లదనం కోసం మందుబాబులు ఎక్కువగా బీరు తాగడానికి మొగ్గుచూపుతారు.

Update: 2023-05-22 12:25 GMT

Health Tips: బీర్‌ తాగిన తర్వాత వీటిని ముట్టవద్దు.. లేదంటే మూల్యం చెల్లించాల్సిందే..!

Health Tips: వేసవి సీజన్‌లో ఎండ మండిపోతుంది. దీంతో చల్లదనం కోసం మందుబాబులు ఎక్కువగా బీరు తాగడానికి మొగ్గుచూపుతారు. అయితే కొంతవరకు ఇది మంచిదే అయినప్పటికీ దీంతో పాటు కొన్ని ఆహార పదార్థాలు తిని ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటారు. వాస్తవానికి బీర్‌ లేకుండా ఏ పార్టీ కానీ ఫంక్షన్‌ కానీ పూర్తికాదు. అయితే బీరుతో పాటు కొన్ని ఆహార పదార్థాలని తీసుకోవడం హానికరం. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

1. బ్రెడ్ పదార్థాలు

బీరు తాగిన 2 గంటల వరకు బ్రెడ్ లేదా బ్రెడ్‌తో తయారు చేసిన ఆహార పదార్థాలని తినకూడదు. దీనివల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. అందుకే బీర్ తాగిన తర్వాత బ్రెడ్ తో చేసిన వాటికి దూరంగా ఉండటం మంచిది.

2. ఫ్రెంచ్ ఫ్రైస్ ఆహారాలు

బీర్ తాగిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఆహారపదార్థాలని తినవద్దు. వీటివల్ల ఉదర సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీటి జోలికి పోవద్దు.

3. మసాలా పదార్థాలు

చాలామంది బీరుతో పాటు అధిక మసాలా పదార్థాలు తీసుకుంటారు. కానీ ఇది మంచి పద్దతి కాదు. వీటివల్ల శరీరానికి తీవ్ర హాని జరుగుతుంది. కడుపులో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి. లివర్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

4. ఉప్పు కలిపిన వేరుశెనగ

కొంతమంది బీరుతో పాటు ఉప్పు కలిపిన వేరుశెనగ గింజలని తింటారు. ఇవి కూడా ఆరోగ్యానికి హానికరం. వీటివల్ల డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది.

5. తియ్యటి పదార్థాలు

బీరు తాగిన తర్వాత స్వీట్లు కానీ తియ్యటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి. ఈ రెండింటి కలయిక శరీరానికి మంచిది కాదు. చర్మం సంబంధమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు కొన్నిసార్లు డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.

Tags:    

Similar News