Health Tips: అవసరానికి మించి వెల్లుల్లి కారం తినకూడదు.. ఈ సమస్యలు ఎదురవుతాయి..!

Health Tips: ప్రతి ఇంటి కిచెన్‌లో ఎన్నో మసాలాలు ఉంటాయి. వీటిలో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉంటాయి. ఇవి చాలా ఆరోగ్య సమస్యలను నయం చేస్తాయి.

Update: 2023-12-15 02:30 GMT

Health Tips: అవసరానికి మించి వెల్లుల్లి కారం తినకూడదు.. ఈ సమస్యలు ఎదురవుతాయి..!

Health Tips: ప్రతి ఇంటి కిచెన్‌లో ఎన్నో మసాలాలు ఉంటాయి. వీటిలో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉంటాయి. ఇవి చాలా ఆరోగ్య సమస్యలను నయం చేస్తాయి. వాటిలో వెల్లుల్లి, కారం, ఉల్లిపాయలు చాలా ముఖ్యమైనవి. చాలామంది జ్వరం వచ్చినప్పుడు లేదా జలుబు, దగ్గు సమయంలో వెల్లుల్లి కారం తీసుకుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువగా తీసుకుంటే చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

వెల్లుల్లి, ఉల్లిపాయలు లేదా మిరపకాయలు తినడం వల్ల ఉబ్బరం సమస్య ఎదురవుతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు ఏర్పడుతాయి. పచ్చి వెల్లుల్లి ఘాటైన వాసన, రుచిని కలిగి ఉంటుంది. ఫ్రక్టాన్స్, కరిగే ఫైబర్స్ వెల్లుల్లిలో ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా ఎర్ర మిరపకాయ నొప్పి, మంట, వికారం, వాపు వంటి సమస్యలను కలిగిస్తాయి. అందుకే ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. పరిమితికి మించి తింటే శరీరానికి హాని జరుగుతుందని తెలుసుకోండి.

జీలకర్ర

జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వీటిని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , కార్డియో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్స్ జీలకర్రలో ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. సమతుల్య జీర్ణక్రియకు ఉపయోగపడుతాయి.

ఫెన్నెల్

ఫెన్నెల్‌లో యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ సమ్మేళనాలన్నీ కడుపుకు మేలు చేస్తాయి. ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. ఫెన్నెల్‌లో యాంటిస్పాస్మోడిక్, అనెథోల్ ఏజెంట్లు ఉంటాయి. ఫెన్నెల్ పేగులలో ఉండే హానికరమైన సూక్ష్మజీవులను తగ్గిస్తాయి.

నల్ల మిరియాలు

నల్ల మిరియాలు వంటగదిలో లభిస్తాయి. వీటిలో పైపెరిన్ అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను ప్రోత్సహించడంతో పాటు శరీరంలోని పోషకాల శోషణను ప్రోత్సహిస్తుంది. బ్లాక్ పెప్పర్‌లో ఉండే సమ్మేళనాలు జీర్ణశయాంతర పేగులలో రక్త ప్రవాహాన్ని పెంచడానికి పని చేస్తాయి.

Tags:    

Similar News