Empty Stomach: పరగడుపున ఈ 4 పనులు అస్సలు చేయవద్దు.. అనారోగ్యానికి గురవుతారు..!
Empty Stomach: ఉదయం పరగడుపున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. దీనివల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Empty Stomach: ఉదయం పరగడుపున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. దీనివల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదయపు దినచర్య రోజు మొత్తం ప్రభావాన్నిచూపుతుంది. అందుకే మంచి జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. ఈ సమయంలో ఎలాంటి ఆహారపదార్థాలు తినాలి ఎలాంటి ఆహారాలు తినకూడదో తెలుసుకోవాలి. సరైన మార్గంలో రోజు ప్రారంభించాలి. లేదంటే రోజు మొత్తం ఇబ్బందిగా ఉంటుంది. పరగడుపున ఏం చేయాలో ఏం చేయకూడదో ఈరోజు తెలుసుకుందాం.
కోపం తెచ్చుకోవద్దు
ఉదయం నిద్రలేవగానే మూడ్‌ని పాజిటివ్‌గా ఉంచుకోవాలి. కొంతమందికి ఉదయాన్నే నిద్రలేవడం బద్దకంగా ఉంటుంది. అలారం మోగడంతో లేచి ఆఫీసుకు వెళ్లాలనే ఆలోచనతో కోపంగా ఉంటారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోకపోతే బీపీ పెరుగుతుంది. దీని కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
టీ, కాఫీలు తాగవద్దు
భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఉదయం నిద్రలేచిన తర్వాత టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇది లేకుండా వారి రోజు ప్రారంభం కాదు. కానీ పరగడుపున ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది మలబద్ధకం అసిడిటీ సమస్యలకు దారితీస్తుంది.
చూయింగ్ గమ్ నమలడం
కొంతమంది చూయింగ్ గమ్ కు అలవాటు పడి ఉంటారు. ఉదయం నిద్ర లేవగానే చూయింగ్ గమ్ నములుతారు. దీనివల్ల రెండు ప్రతికూలతలు ఉన్నాయి. మొదటిది చూయింగ్ గమ్‌లు చాలా తీపిగా ఉంటాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. రెండవది నమలడం వల్ల జీర్ణ ఆమ్లాలు కడుపులో విడుదలవుతాయి. ఖాళీ కడుపు కారణంగా ఆమ్లత్వం ఏర్పడుతుంది.
మద్యం తాగవద్దు
ఉదయం లేదా రాత్రి అయినా పరగడుపుతో ఆల్కహాల్ తీసుకుంటే అది రక్తప్రవాహంలోకి వెళ్లి శరీరంలో వేగంగా వ్యాపిస్తుంది. ఈ పరిస్థితిలో మన పల్స్ రేటు తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు, మూత్రపిండాలు దెబ్బతింటాయి. అందుకే పరగడుపున మద్యం అస్సలు తాగవద్దు.