సోడియం లోపంతో చాలా సమస్యలు.. అందుకే ఈ ఆహారాలు..!
సోడియం లోపంతో చాలా సమస్యలు.. అందుకే ఈ ఆహారాలు..!
Sodium Deficiency: సోడియం ఒక ఎలక్ట్రోలైట్. ఇది ఎక్కువగా శరీరంలోని సిరల్లో ఉంటుంది. కండరాల పనితీరుకు సోడియం అత్యవసరం. ఇది శరీరం ద్రవ సమతుల్యతను నియంత్రిస్తుంది. కిడ్నీలు మీ శరీరంలోని సోడియాన్ని నియంత్రిస్తాయి. చెమట ద్వారా శరీరం నుంచి సోడియం బయటికి వెళుతుంది. శరీరానికి సోడియం అందించే ఆహారాల గురించి తెలుసుకుందాం.
1. ఉప్పు
మన ఇళ్లలో ఉపయోగించే తెల్ల ఉప్పు దీనినే సాధారణ ఉప్పు అని కూడా పిలుస్తారు. ఇది సోడియం గొప్ప మూలం. 100 గ్రాముల ఉప్పులో 38,758 mg సోడియం లభిస్తుంది. అయితే దీనిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది.
2. పన్నీరు
పన్నీరులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పన్నీరులో 300 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. ఇది రోజువారీ అవసరంలో 12 శాతం. ఇది ఆహారం రుచిని మెరుగుపరుస్తుంది. కానీ దీనిని తక్కువ పరిమాణంలో తినడం మంచిది.
3. సీ ఫుడ్
సీ ఫుడ్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. షెల్ఫిష్, క్యాన్డ్ ట్యూనా ఫిష్ లలో ఎక్కువ ఉప్పు ఉంటుంది. కాబట్టి సీఫుడ్‌ను జాగ్రత్తగా ఎంచుకోవడం ముఖ్యం. చేపలలో సాల్మన్, హాలిబట్, హాడాక్ ఉత్తమ ఎంపికలు అని చెప్పవచ్చు.
4. మాంసం
మాంసంలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కానీ శరీరానికి కావలసినంత మాత్రమే తీసుకోవాలి. సహజంగా శరీరంలో సోడియం అవసరాలను తీర్చాలంటే కూరగాయల రసం ఉత్తమ ఎంపికని చెప్పవచ్చు. అయితే మార్కెట్‌లో లభించే ప్యాక్ చేసిన జ్యూస్‌లకు దూరంగా ఉండటం మేలు.