Health Tips: ఈ సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగితే ప్రమాదమే.. ఎందుకో తెలుసా..?
Coconut Water: కొబ్బరి నీళ్ల వినియోగం ఆరోగ్యానికి చాలా మంచిది.
Coconut Water: కొబ్బరి నీళ్ల వినియోగం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు, గోళ్లకు చాలా మంచిది. ఇవే కాకుండా.. శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు కొబ్బరి నీళ్లలో ఉన్నాయి. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తీసుకుంటే ప్రమాదం. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి. అలాగే సరైన సమయంలో కాకుండా.. ఇతర సందర్భాల్లో కొబ్బరి నీళ్లు తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.
అధిక రక్తపోటుకు మందులు వాడేవారు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగకూడదు. ఇందులో రక్తపోటును తగ్గించే గుణాలు ఉన్నాయి. దీనివలన మీకు తక్కువ రక్తపోటు సమస్య కలుగుతుంది.
జలుబు ఉన్నవారు రాత్రిళ్లు కొబ్బరి నీళ్లు అస్సలు తాగకూడదు. అలాగే కడుపులో సమస్యలు ఉన్నవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఇది శరీరంలో నీటి పరిమాణాన్ని పెంచుతుంది. అంతేకాకుండా విరేచనాలు కలుగుతాయి.
పొట్ట ఉబ్బరం సమస్యతో బాధపడేవారు కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగకూడదు. కొబ్బరి నీళ్లు తాగాలనుకుంటే ముందుగా వైద్యుడి సలహాలు తీసుకోవాలి.