Diabetic Patients: డయాబెటిక్‌ పేషెంట్లు ఈ పండ్లకి దూరంగా ఉండటం మంచిది.. ఎందుకంటే..?

Diabetic Patients: డయాబెటిక్ రోగులకు అన్ని పండ్లు ప్రయోజనకరం కాదు. వీరు కొన్ని పండ్లకి దూరంగా ఉండటం మంచిది.

Update: 2022-05-27 12:45 GMT

Diabetic Patients: డయాబెటిక్‌ పేషెంట్లు ఈ పండ్లకి దూరంగా ఉండటం మంచిది.. ఎందుకంటే..?

Diabetic Patients: డయాబెటిక్ రోగులకు అన్ని పండ్లు ప్రయోజనకరం కాదు. వీరు కొన్ని పండ్లకి దూరంగా ఉండటం మంచిది. ఇవి తింటే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు. అలాంటి పండ్ల గురించి ఒక్కసారి తెలుసుకోవడం మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ద్రాక్ష చాలా హానికరం. ఈ పండులో పెద్ద మొత్తంలో విటమిన్ సి ఉన్నప్పటికీ ఇది డయాబెటిక్ రోగులకు మంచిది కాదు. ఇందులో ఉండే చక్కెర డయాబెటిక్ రోగుల సమస్యను పెంచుతుంది. కాబట్టి దీనికి దూరంగా ఉండటం మంచిది.

డయాబెటిస్‌ ఉన్నవారు అరటిపండు కూడా తినకూడదు. ఈ పండులో పిండి పదార్థాలు, చక్కెర పరిమాణం ఎక్కువగా ఉంటుంది, దీని కారణంగా రక్తంలో చక్కెర పెరిగే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో మీరు అరటి పండు నుంచి దూరంగా ఉండాలి. లేకపోతే దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే అంజీర్ పండ్ల వినియోగం కూడా డయాబెటీస్‌ రోగులకు ప్రమాదకరం. ఇందులో పిండి పదార్థాలు, చక్కెర పరిమాణం చాలా ఎక్కువ. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది.

సీతాఫలాలలో కూడా చక్కెర స్థాయిలు ఎక్కువ‌గా ఉంటాయి. అందుకే షుగ‌ర్ పేషెంట్లు దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే దానిమ్మ మ‌ధ‌మేహ రోగుల‌కు మంచి ఆహారం. అలా అని ఓవ‌ర్‌గా తీసుకోకూడ‌దు. రోజుకు ఒక‌టి తింటే రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. డయాబెటీస్‌ రోగులు రోజుకు ఒక యాపిల్ తింటే ఎలాంటి స‌మ‌స్యలు ఉండ‌వు. అంత‌కు మించి తింటే మాత్రం అనేక స‌మ‌స్యలు ఎదుర‌వుతాయి. వీలైతే రోగులు వైద్యుడి సలహా మేరకు పండ్లు తినడం మంచిది. 

Tags:    

Similar News