White Hair Problems: ఈ విటమిన్‌ లోపిస్తే తెల్లజుట్టు వస్తుంది.. నివారించడానికి ఇలా చేయండి..!

White Hair Problems: నేటికాలంలో చాలామంది చిన్నవయసులోనే తెల్లజుట్టుతో ఇబ్బందిపడుతున్నారు.

Update: 2023-06-27 12:30 GMT

White Hair Problems: ఈ విటమిన్‌ లోపిస్తే తెల్లజుట్టు వస్తుంది.. నివారించడానికి ఇలా చేయండి..!

White Hair Problems: నేటికాలంలో చాలామంది చిన్నవయసులోనే తెల్లజుట్టుతో ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా చదువుకునే యువత తెల్లజుట్టువల్ల ఆందోళన చెందుతున్నారు. ఇది వీరి అంచనాలకి విరుద్దంగా జరుగుతుంది. అయితే దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. సాధారణంగా 35 ఏళ్ల తర్వాత వెంట్రుకలు రంగు మారాలి. కానీ 25 ఏళ్ల వయసులోనే ఇది జరుగుతుంది. దీని వల్ల యువతలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. తెల్లజుట్టు ఎందుకు వస్తుంది. దీనికి గల కారణాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

చిన్న వయసులోనే తెల్లజుట్టు

చిన్న వయస్సులో తెల్ల జుట్టు జన్యుపరమైన కారణాల వల్ల రావొచ్చు లేదా రోజువారీ ఆహారంతో పోషకాలు తక్కువగా ఉండటం వల్ల కూడా వస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల తెల్ల జుట్టు పెరగకుండా నిరోధించవచ్చు. జుట్టు సంరక్షణకు చాలా పోషకాలు అవసరం అయినప్పటికీ శరీరంలో విటమిన్ బి లోపం ఉంటే జుట్టు తెల్లబడుతుంది.

విటమిన్ బి లోపం

శరీరంలో విటమిన్ బి లోపం ఉన్నప్పుడు దాని ప్రభావం జుట్టుపై కనిపిస్తుంది. దీని కారణంగా జుట్టు తెల్లబడటమే కాకుండా జుట్టు రాలే సమస్య ప్రారంభమవుతుంది. తరువాత ఇది బట్టతలకి కారణం అవుతుంది. అందుకే ఆహార పదార్ధాలలో బి విటమిన్ లోపించకుండా చూసుకోవాలి.

విటమిన్ బి ఎందుకు ముఖ్యం

మీరు చిన్న వయస్సులో జుట్టు నెరిసే సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే విటమిన్ బి, విటమిన్ బి 6, విటమిన్ బి 12 తీసుకోవాలి. ఈ పోషకాల లోపం జుట్టుకు ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది. తలపై జుట్టు నెరిసేలా చేస్తుంది.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి

విటమిన్ బి లోపాన్ని తీర్చడానికి రోజువారీ ఆహారంలో పుట్టగొడుగులు, పప్పులు, చాక్లెట్లను చేర్చుకోవాలి. జుట్టు ఆరోగ్యానికి మేలు చేసే రాగి వీటిలో ఉంటుంది. అంతే కాకుండా కరివేపాకు, ఉసిరి వంటివి జుట్టుకు ట్యాబ్లెట్ల కంటే తక్కువేమి కాదు. వీటిని ప్రతి వంటకంలో ఉండేలా చూసుకోవాలి. టెన్షన్‌, ఒత్తిడికి దూరంగా ఉండాలి.

Tags:    

Similar News