Health Tips: శరీరంలో దీనిలోపం ఉంటే తలనొప్పి, అలసట తప్పదు..!

Health Tips: శరీరంలో దీనిలోపం ఉంటే తలనొప్పి, అలసట తప్పదు..!

Update: 2022-09-18 05:47 GMT

Health Tips: శరీరంలో దీనిలోపం ఉంటే తలనొప్పి, అలసట తప్పదు..!

Health Tips: మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తినాలి. లేదంటే బలహీనంగా మారుతారు. అంతేకాదు అనేక రకాల వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. అనేక అవయవాలు దెబ్బతింటాయి. ముఖ్యమైన మినరల్స్‌లో ఐరన్‌ ఒకటి. దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఐరన్‌ ప్రయోజనాలు, లోపిస్తే కనిపించే లక్షణాల గురించి తెలుసుకుందాం.

ఐరన్‌ ప్రయోజనాలు

1. ఐరన్ జుట్టును బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. దీని లోపం ఉంటే జుట్టు రాలడానికి కారణమవుతుంది

2. ఐరన్ మన చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చర్మం మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా కళ్ల దగ్గర ఉన్న నల్లటి వలయాలు తొలగిపోతాయి.

3. ఐరన్ శరీరానికి ఆక్సిజన్ సక్రమంగా అందేలా చేస్తుంది.

4. ఐరన్ సహాయంతో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.

5. చాలా సార్లు పిల్లలకు ఆకలి వేయదు. ఈ పరిస్థితిలో ఐరన్‌ రిచ్ ఫుడ్ తీసుకోవాలి.

ఐరన్‌ లోపం లక్షణాలు

చిరాకు, చర్మం రంగు మారడం, పొడిబారడం, అలసట, తలనొప్పి, తల తిరగడం, ఛాతీ నొప్పి, వేగంగా గుండె కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంద, చల్లని చేతులు కాళ్ళు,

బలహీనమైన ఆలోచనా సామర్థ్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జుట్టు రాలడం, గోళ్ల తెలుపు రంగులోకి మారడం జరుగుతుంది.

ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు

1. దుంపలు

2. ఉసిరి, నేరేడు పండ్లు

3. పిస్తాపప్పు

4. నిమ్మకాయ

5. దానిమ్మ

6. యాపిల్

7. బచ్చలికూర

8. ఎండిన ఎండుద్రాక్ష

9. అంజీర్

10. పండిన జామ

Tags:    

Similar News