Health Tips: యవ్వనంగా కనిపించడానికి డైలీ ఈ ఒక్క జ్యూస్‌ చాలు.. ఖర్చు కూడా తక్కువే..!

Health Tips: చలికాలం, వేసవికాలం ఏదైనా కానీ ప్రతిరోజు క్యారెట్‌ జ్యూస్‌ తాగాల్సిందే.

Update: 2022-11-10 12:12 GMT

Health Tips: యవ్వనంగా కనిపించడానికి డైలీ ఈ ఒక్క జ్యూస్‌ చాలు.. ఖర్చు కూడా తక్కువే..!

Health Tips: చలికాలం, వేసవికాలం ఏదైనా కానీ ప్రతిరోజు క్యారెట్‌ జ్యూస్‌ తాగాల్సిందే. దీనివల్ల శరీరంలో రక్తహీనత తొలగిపోతుంది. బరువు అదుపులో ఉంటుంది. క్యారెట్‌లో విటమిన్లు ఎ, సి, కె, బి8, జింక్, ఐరన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా పిల్లలు ప్రతిరోజు తీసుకోవాలి. అంతేకాదు క్యారెట్‌ ఖర్చు కూడా తక్కువే ఉంటుంది. క్యారెట్‌ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. క్యారెట్ జ్యూస్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల చర్మానికి చాలా గ్లో వస్తుంది. దీని రసాన్ని తాగడం వల్ల ముఖంలో మొటిమలు, నల్ల మచ్చలు తొలగిపోతాయి. కంటి చూపు సమస్యతో బాధపడేవారికి క్యారెట్ జ్యూస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి పనిచేస్తుంది.

2. క్యారెట్ జ్యూస్ శరీరంలోని హిమోగ్లోబిన్ లోపాన్ని తీరుస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి క్యారెట్ రసం ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వినియోగం వల్ల శరీరంలో రక్తం వేగంగా ఏర్పడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరం జీర్ణ శక్తిని పెంచుతుంది. ఇది మలబద్ధకం సమస్యలో ఉపశమనాన్ని అందిస్తుంది.

3. క్యారెట్ రసంలో బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది శరీరంలో డిప్రెషన్ లక్షణాలని పెరగకుండా చేస్తుంది. క్యారెట్ జ్యూస్‌లో పంచదార, మిరియాలు కలిపి తాగితే కఫం సమస్య తగ్గుతుంది.

Tags:    

Similar News