Health Tips: దోసకాయతో వృద్ధాప్యానికి చెక్.. చర్మ సమస్యలకి చక్కటి నివారణ..!
Health Tips: దోసకాయతో వృద్ధాప్యానికి చెక్.. చర్మ సమస్యలకి చక్కటి నివారణ..!
Health Tips: దోసకాయ ఒక సూపర్ ఫుడ్. ఇందులో 95% వాటర్ కంటెంట్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. దోసకాయ టోనర్ చర్మాన్ని లోపలి నుంచి కాపాడుతుంది. తద్వారా మీరు పొడి చర్మాన్ని నివారించవచ్చు. దోసకాయలో యాంటీ జింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వృద్ధాప్య లక్షణాలని నివారించవచ్చు. దోసకాయ టోనర్ ఏ విధంగా తయారుచేయాలో తెలుసుకుందాం.
దోసకాయ టోనర్ చేయడానికి ముందుగా దోసకాయను బాగా కడగాలి. తర్వాత పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత గిన్నెలో దోసకాయ ముక్కలు వేసి నీరు పోయాలి. వీటిని 5 నుంచి 7 నిమిషాల వరకు తక్కువ మంట మీద ఉడికించాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని చల్లబరచాలి.తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత జల్లెడ సహాయంతో వడపోసి ఒక సీసాలో నింపాలి. కావాలంటే దీనికి రోజ్ వాటర్ కలుపవచ్చు.
దోసకాయ టోనర్ అప్లై చేసేముందు ముఖాన్ని బాగా కడగాలి. తర్వాత దోసకాయ టోనర్ అప్లై చేయాలి. ఇది మీ చర్మాన్ని లోపలి నుంచి తేమగా ఉంచుతుంది. గుర్తుంచుకోండి 2-3 రోజుల కంటే ఎక్కువ దోసకాయ టోనర్‌ను ఉపయోగించవద్దు. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. హైడ్రేట్‌గా ఉంచుతుంది. పొడిచర్మానికి చక్కటి నివారణ అని చెప్పవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.