Health Tips: పచ్చి కొత్తిమీర ఆరోగ్యానికి దివ్యవౌషధం.. ఈ పనులు జరగాలంటే తీసుకోవాల్సిందే..!
Health Tips: మనం ఇంట్లో కూర వండుకుంటే చివరలో కొత్తిమీర వేయంది అది పూర్తికాదు. ఎందుకంటే కొత్తిమీరు కూరకు భలే రుచిని అందిస్తుంది.
Health Tips: మనం ఇంట్లో కూర వండుకుంటే చివరలో కొత్తిమీర వేయంది అది పూర్తికాదు. ఎందుకంటే కొత్తిమీరు కూరకు భలే రుచిని అందిస్తుంది. అందుకే ప్రతి కూరలో కొత్తిమీరని వాడుతారు. ఇంకొందరు పచ్చడి కూడా తయారుచేస్తారు. ఇంకొంతమంది నేరుగా తినడానికి ఇష్టపడతారు. సలాడ్‌లో కూడా కొత్తిమీర ఆకులను కలుపుతారు. ఇది అందంగా కనిపించడమే కాకుండా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
కొత్తిమీర ప్రయోజనాలు
పచ్చి కొత్తిమీరలో విటమిన్ ఎ, బి, సి, కె, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
కాలేయ వ్యాధిలో మేలు
కాలేయ సంబంధిత సమస్యలకు కొత్తిమీర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొత్తిమీర ఆకులలో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలు పిత్త రుగ్మతలు, కామెర్లు వంటి కాలేయ వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి.
మంచి జీర్ణక్రియ
కొత్తిమీరను తినడం వల్ల ప్రజలు జీర్ణవ్యవస్థ లోపాలు, పేగు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. ఇది పొట్టను ఫిట్‌గా ఉంచుతుంది. ఆకలిని పెంచుతుంది.
రోగనిరోధక శక్తి పెంచుతుంది
కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే సెల్యులార్ డ్యామేజ్ ను నివారిస్తాయి. కొత్తిమీరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె జబ్బులను నివారిస్తుంది
కొత్తిమీరను తినడం వల్ల మూత్రం ద్వారా శరీరం నుంచి అదనపు సోడియం తొలగిపోతుంది. దీని వల్ల శరీరం లోపలి నుంచి ఫిట్‌గా ఉంటుంది. దీని వినియోగం చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది
కొత్తిమీరను ఆహారంలో ఉపయోగించడం వల్ల ఎంజైమ్‌లు చురుకుగా పనిచేస్తాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతో మధుమేహం నియంత్రణలో ఉంటుంది, వ్యక్తి ఫిట్‌గా ఉంటాడు.