Copper Rich Food: రాగి తక్కువగా ఉంటే చాలా అనర్థాలు.. ఈ ఆహారాలు తింటే బెస్ట్..!
Copper Rich Food: రాగి శరీరానికి అత్యంత అవసరమైన ఖనిజం.
Copper Rich Food: రాగి శరీరానికి అత్యంత అవసరమైన ఖనిజం. ఇది ఎర్ర రక్త కణాలు, ఎముకలు, కణజాలం, కొన్ని ముఖ్యమైన ఎంజైమ్‌ల తయారీలో ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ ప్రాసెసింగ్, రోగనిరోధక వ్యవస్థ పనితీరు, కడుపులో శిశువుల అభివృద్ధికి కూడా రాగి అవసరమవుతుంది. ప్రమాణాల ప్రకారం ఆరోగ్యకరమైన వయోజన వ్యక్తికి ప్రతిరోజూ 900 mg రాగి అవసరం. ఇది లేకుంటే అలసట, బలహీనత, తరచుగా అనారోగ్యం, బలహీనమైన, పెళుసుగా ఉండే ఎముకలు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, నడవడంలో ఇబ్బంది, చలికి సున్నితత్వం, లేత చర్మం, జుట్టు అకాల నెరసిపోవడం, దృష్టి కోల్పోవడం జరుగుతుంది. అందుకే రాగి అధికంగా ఉండే ఆహారాలని తినడం ఉత్తమం. వాటి గురించి తెలుసుకుందాం.
1. డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్‌ని అందరు ఇష్టపడుతారు. ఇందులో కోకో సాలిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. అలాగే చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని నిత్యం తినడం వల్ల శరీరానికి కావల్సినంత రాగి అందుతుంది.
2. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ దాదాపు అన్ని రకాల జాబితాలో చోటు దక్కించుకుంటాయి. ఎందుకంటే వీటిలో పోషకాలకి కొరత ఉండదు. ఫైబర్, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్ అధికంగా ఉంటాయి. పాలకూర తింటే రాగికి లోటు ఉండదు.
3. లోబ్‌స్టర్
లోబ్‌స్టర్ సముద్రపు అడుగుభాగంలో నివసించే పెద్ద షెల్ ఫిష్. దీని మాంసం తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్, సెలీనియం, విటమిన్ B12తో సహా అన్ని విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. దీంతో పాటు రాగి కూడా పుష్కలంగా లభిస్తుంది.
4. గింజలు
గింజలు పోషకాల నిధి అని చెబుతారు. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. రాగి కూడా ఇందులో పుష్కలంగా లభిస్తుంది. బాదం, వేరుశెనగ తింటే ఈ పోషకం లోపం ఉండదు. అలాగే నువ్వులలో రాగి ఎక్కువగా ఉంటుంది. ఇది దీని పవర్‌హౌస్‌గా పిలుస్తారు.