Health Tips: మలబద్దకాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది.. ఈ నివారణ చర్యలు పాటించండి..!
Health Tips: ఈ రోజుల్లో మలబద్దక సమస్యని చాలామంది ఎదుర్కొంటున్నారు.
Health Tips: ఈ రోజుల్లో మలబద్దక సమస్యని చాలామంది ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం జరుగుతుంది. దీనిపట్ల ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. జంక్ ఫుడ్ తీసుకోవడం, ఆల్కహాల్ తీసుకోవడం, ఆహారంలో పీచుపదార్థాలు లేకపోవడం, తక్కువ నీరు తాగడం, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, సిగరెట్ తాగడం తదితర కారణాల వల్ల మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య దీర్ఘకాలం కొనసాగితే పైల్స్ వంటి ప్రాణాంతక వ్యాధి పుట్టుకొస్తుంది. దీనిని నివారించడానికి కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
మందులు వద్దు
మలబద్దక సమస్య ఉన్నప్పుడు మందులు తీసుకోవడం మానేయండి. పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి హాని కలిగించని చిట్కాలని అనుసరించాలి. ద్రవ, ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను పుష్కలంగా తీసుకోవాలి. ఔషధం తీసుకోవాలనుకుంటే ఆయుర్వేద నివారణలను ప్రయత్నించండి.
తాజా ఆహారం
మలబద్ధకం సమస్య ఉన్నవారు ఎల్లప్పుడూ తాజాగా వండిన ఆహారాన్ని తినాలి. వేడి ఆహారాలు, వేడి పానీయాలు, బాగా ఉడికించిన కూరగాయలను తినాలి. కూరగాయలలో నూనె మసాలాల వాడకాన్ని తగ్గించాలి.
త్రిఫల చికిత్స
త్రిఫల చూర్ణం మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. త్రిఫల గ్లైకోసైడ్‌లను కలిగి ఉంటుంది. ఇందులో భేదిమందు లక్షణాలు ఉంటాయి. దీనిని వేడి నీటిలో కలిపి తీసుకోవచ్చు.
వేయించిన సోంపు
మీరు మలబద్ధకంతో ఇబ్బంది పడుతుంటే వేయించిన సోంపు ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో ఒక చెంచా వేయించిన సోంపు కలిపి తాగాలి. ఇది మీ జీర్ణక్రియ ప్రక్రియను బలపరుస్తుంది.
బేల్ సిరప్, లికోరైస్ రూట్
బేల్ పండులో భేదిమందు గుణాలు ఉంటాయి. ఇది మలబద్ధకం సమస్యకి చక్కటి పరిష్కారమని చెప్పవచ్చు. ఇది కాకుండా లైకోరైస్ రూట్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీ పేలవమైన జీర్ణక్రియను బలపరుస్తుంది.