Hair Care Tips: జుట్టు విపరీతంగా రాలుతుందా.. ఈ ఆయిల్ ట్రై చేయండి ఫలితం చూస్తారు..!
Hair Care Tips: ఆవనూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.
Hair Care Tips: ఆవనూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇది జుట్టుకు చాలా మేలు చేస్తుంది. మస్టర్డ్ ఆయిల్ స్కాల్ప్ ను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. ఆముదం నూనెలో కూడా ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు నూనెలను కలిపి రాసుకుంటే జుట్టు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. జుట్టును దృఢంగా, ఒత్తుగా, మెరిసేలా చేస్తుంది. అయితే దీనిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
ఆవాలు-ఆముదం నూనె తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. ఇందులో ఆవాల నూనె, ఆముదం నూనె సమాన పరిమాణంలో తీసుకోవాలి. తరువాత ఈ నూనె మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేయాలి. తర్వాత జుట్టుకు నేరుగా అప్లై చేయాలి. ఇది జుట్టులో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. దీంతో జుట్టుకు తగినంత పోషణ లభిస్తుంది. ఇది జుట్టును బలంగా చేస్తుంది.
ఈ నూనెలు జుట్టులో ఉన్న చుండ్రును తొలగిస్తాయి. రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు మెరుస్తూ, పొడవుగా, ఒత్తుగా మారుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం జుట్టు కడగడానికి కనీసం 4 గంటల ముందు ఈ నూనెతో జుట్టును మసాజ్ చేయాలి. ఉత్తమ ఫలితాల కోసం వారంలో 2-3 సార్లు అప్లై చేయాలి. ఎక్కువ సార్లు అప్లై చేయడం వల్ల జుట్టు సమస్యల నుంచి బయటపడుతారు.