Clove: దగ్గుకి దివ్య ఔషధం లవంగం.. ఒక్క రోజులో మటుమాయం..!
Clove: దగ్గుకి దివ్య ఔషధం లవంగం.. ఒక్క రోజులో మటుమాయం..!
Clove: వర్షాకాలంలో జలుబు, దగ్గు చాలా పెద్ద సమస్యలు. ఒక్కోసారి జలుబు ఆగిపోయిన తర్వాత కూడా కఫం, దగ్గు చాలా రోజులు వేధిస్తాయి. ఈ పరిస్థితిలో చాలా సార్లు మందులు వాడినా ఎటువంటి ఫలితం ఉండదు. ఇలాంటి సయయంలో మీకు దగ్గు ఎక్కువగా వస్తుంటే లవంగాలను ఉపయోగించవచ్చు. వీటిని తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఈ మిశ్రమాన్ని తీసుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
వర్షాకాలంలో పిల్లలకి దగ్గు ఉంటే తేనె, లవంగం మిశ్రమాన్ని తినిపించండి. దీని కోసం 7-8 లవంగాలు తీసుకొని వాటిని పాన్ మీద కొద్దిగా వేడి చేయండి. చల్లారాక లవంగాలను మెత్తగా పొడి చేయండి. ఈ పొడిని ఒక గిన్నెలో వేసి దానికి 3-4 చెంచాల తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడిచేసి ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఒక్కో చెంచా తీసుకోవాలి. ఇది దగ్గు నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మీరు 1-2 రోజులు మాత్రమే తీసుకోవాలి. ఇది గొంతులో చాలా ఉపశమనాన్ని అందిస్తుంది.
లవంగం ప్రయోజనాలు
లవంగాలు వాపును తగ్గించే అనేక పదార్ధాలను కలిగి ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. లవంగాలలో యూజినాల్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇందులో ఉండే ఫ్రీ రాడికల్స్ గుండె, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. లవంగాలు తినడం వల్ల కడుపులో అల్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇవి కడుపులోని పొరను రక్షిస్తాయి. లవంగం శ్లేష్మాన్ని చిక్కగా చేస్తుంది. ఇది అల్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. లవంగాలు తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య తగ్గుతుంది.