Cholesterol: చలికాలంలో కొలస్ట్రాల్‌ ప్రమాదం ఎక్కువ.. కారణాలు ఇవే..!

Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువైతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ.. అందుకే చలికాలంలో గుండెపోటు కేసులు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

Update: 2022-12-08 05:00 GMT

Cholesterol: చలికాలంలో కొలస్ట్రాల్‌ ప్రమాదం ఎక్కువ.. కారణాలు ఇవే..!

Cholesterol: చలికాలంలో కొలెస్ట్రాల్ స్థాయి గణనీయంగా పెరుగుతుంది . ఇది గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. వాతావరణంలో మార్పు కారణంగా రక్తంలో లిపిడ్ల స్థాయి హెచ్చుతగ్గులకు లోనవుతుంటుంది. దీని కారణంగా కొలస్ట్రాల్ పెరుగుదలలో మార్పులు సంభవిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువైతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే చలికాలంలో గుండెపోటు కేసులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడమే దీనికి కారణం.

తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలు. ఒకటి మంచిది, మరొకటి చెడు కొలెస్ట్రాల్. అయితే చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరంలో చాలా ఇబ్బంది ఉంటుంది. గుండె ధమనులలో అడ్డంకులు ఏర్పడతాయి. గుండెకు రక్తాన్ని పంప్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఈ సీజన్‌లో ప్రజలు ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు చేర్చాలి. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలకి దూరంగా ఉండాలి. జున్ను, వెన్న, నెయ్యి, క్రీము పాలు తీసుకోవడం తగ్గించాలి. రెడ్ మీట్ తినవద్దు. వీధి ఆహారాన్ని నివారించాలి. డైట్‌లో గ్రీన్ వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే వాటిని చేర్చుకోవాలి. ఆల్కహాల్ అలవాటు ఉంటే ఇప్పుడే వదిలేయండి. ధూమపానం చేయవద్దు. ఇది కాకుండా మీ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షను చేయించుకోవడం అవసరం. ఈ పరీక్ష ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది.

Tags:    

Similar News