Health Tips: కొలస్ట్రాల్‌తో గుండెకి ముప్పు.. పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్..!
Health Tips: కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమే ఎక్కువైతే మాత్రం హానికరం.
Health Tips: కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమే ఎక్కువైతే మాత్రం హానికరం. కొలస్ట్రాల్ ఆరోగ్యకరమైన కణాల ఏర్పాటులో సహాయపడుతుంది. ఇది మైనపు లాంటి పదార్థం. దీనివల్ల శరీరంలో రక్త సరఫరా సులభతరం అవుతుంది. అయితే పరిమితి మించితే రక్తనాళాల గోడలపై కొవ్వు రూపంలో పేరుకుపోతుంది. ఇది రక్త సరఫరాకు ఆటంకం కలిగిస్తుంది. ఇది బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటే అది శరీరానికి మేలు చేస్తుంది. కానీ ఎక్కువైతే నష్టాన్ని కలిగిస్తుంది. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉంటాయి. LDL కొలెస్ట్రాల్‌ను చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తారు అలాగే HDLని మంచి కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు పాదాలలో కనిపిస్తాయి. మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు పాదాలలో జలదరింపుగా అనిపిస్తే కొలస్ట్రాల్ పెరిగిందని అర్థం చేసుకోండి. వాస్తవానికి కొలెస్ట్రాల్ కాళ్ళ ధమనులలో పేరుకుపోతుంది. ఇది అధికంగా పెరగడం వల్ల పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD) వస్తుంది. PAD మీ తుంటి, తొడలు లేదా కాళ్లలోని కండరాలలో జలదరింపు భావనని కలిగిస్తుంది.
ధమనులలో కొవ్వు పేరుకుపోయినప్పుడు పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి సంభవిస్తుంది. దీని కారణంగా రక్త సరఫరా ఆగిపోతుంది. ఇది తరచుగా దిగువ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి అవయవాలకు, ముఖ్యంగా కాళ్ళు, తొడల కండరాలకు రక్త సరఫరాను అడ్డుకుంటుంది. అధిక కొలెస్ట్రాల్ ఇతర లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. పాదాలపై చర్మం రంగులో మార్పులు, గోళ్లు నెమ్మదిగా పెరుగుదల, పాదాలపై పుండ్లు మానకపోవడం, పని చేస్తున్నప్పుడు చేతుల్లో నొప్పి, నపుంసకత్వము, జుట్టు రాలడం మొదలైనవి ఉంటాయి.
కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కొలస్ట్రాల్ లెవల్స్‌ని తనిఖీ చేయాలి. లేదంటే ఇది గుండెపోటు, మెదడు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ప్రజలు జీవనశైలిని మార్చుకోవాలి. తక్కువ మద్యం, ధూమపానం, వేయించిన వస్తువులు మానేయడం, ఎక్కువ ఒత్తిడికి లోనుకాకపోవడం, దినచర్యలో యోగా లేదా వ్యాయామాన్ని చేయడం అలవాటు చేసుకోవాలి.