Health Tips: కొలెస్ట్రాల్ సైలెంట్ కిల్లర్.. వెంటనే ఆహారంలో ఈ మార్పులు చేయండి..!
Health Tips: చెడు కొలెస్ట్రాల్‌ను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు.
Health Tips: చెడు కొలెస్ట్రాల్‌ను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఇది శరీరంలో పేరుకుపోయినప్పుడు రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల అధిక రక్తపోటు, ఊబకాయం, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రోజువారీ ఆహారంలో కొంచెం మార్పు చేస్తే అది అధిక కొలెస్ట్రాల్‌ను చాలా వరకు నియంత్రివచ్చు. అయితే ఎలాంటి మార్పులు చేయాలో ఈరోజు తెలుసుకుందాం.
1. గ్రీన్ టీ
మీరు రోజూ తీసుకునే సాధారణ టీలో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీనికి బదులుగా మీరు గ్రీన్ టీకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కొలస్ట్రాల్‌ని తగ్గిస్తూ బరువుని కంట్రోల్‌లో ఉంచుతుంది.
2. పండ్లు, కూరగాయలు
ఈరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వేయించిన ఆహారం తినే ధోరణి బాగా పెరిగింది. ఇందులో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ఇందులో కొలెస్ట్రాల్‌ను తగ్గించే కరిగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి.
3. సోయాబీన్స్
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. దీని కోసం రోజువారీ ఆహారంలో సోయాబీన్స్ చేర్చాలి. ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అనేక నాన్-వెజ్ ఉత్పత్తుల నుంచి ప్రోటీన్ లభించినా ఇది శరీరంలో కొవ్వుశాతాన్ని పెంచుతుంది.
4. మసాల దినుసులు
కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి మసాలా దినుసులు డైట్‌లో ఉండేవిధంగా చూసుకోవాలి. పసుపు, అల్లం, దాల్చినచెక్క, వెల్లుల్లి వంటి సుగంధ ద్రవ్యాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి ఆయుర్వేద లక్షణాలతో నిండి ఉంటాయి. వీటి సహాయంతో సిరల్లో కొవ్వు తగ్గడం ప్రారంభమవుతుంది.