Cholera Cases: కలవర పెడుతున్న కలరా కేసులు..ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోండి

Cholera Cases: మనదేశంలో కలర కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేరళ, గుజరాత్ లో పలువురికి కలరా నిర్ధారణ అయ్యింది. అసలు కలరా లక్షణాలు ఎలా ఉంటాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Update: 2024-07-16 03:30 GMT

Cholera Cases: కలవర పెడుతున్న కలరా కేసులు..ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోండి

Cholera Cases:దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. వాతావరణం మారుతుండటంతో సీజనల్ వ్యాధులు కూడా భయపెట్టిస్తున్నాయి. ప్రమాదకరమైన కలరా వ్యాధి కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఇప్పటికే కేరళతోపాటు గుజరాత్ లో కలరా కేసులను గుర్తించారు అధికారులు. రాజ్ కోట్లోని లోహానగర్ లో రెండు కలరా కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై కలరా కేసు నమోదు అయిన ప్రాంతం నుంచి రెండు నెలలపాటు ఆంక్షలు విధించారు.

కలరా ఎలా సోకుతుంది?

కలరా అనేది విబ్రియో కలరా అనే బ్యాక్టీరియాతో సోకుతుంది. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. కలుషిత నీరు, కలుషిత ఆహారం ద్వారా కలరా వ్యాపిస్తుంది. కలరా సోకిన వ్యక్తికి వాంతులు, అతిసారం కలుగుతాయి. కలరా బ్యాక్టీరియా చిన్న ప్రేగుల్లోకి వెళ్లి విరోచనాలు, వాంతులకు కారణమవుతుంది. వర్షకాలంలో కలుషిత నీటిని తాగడం, అపరిశుభ్రమైన రోడ్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల వ్యాపిస్తుంది. కలరా బ్యాక్టీరియా ఇమ్యూనిటీ వ్యవస్థను దెబ్బతీసి పలు సమస్యలకు కారణం అవుతుంది.

లక్షణాలు :

- వికారం

-వాంతులు

- డీహైడ్రేషన్

- బీపి తగ్గడం

- నీరసం

- హార్ట్ బీట్ పెరగడం

- కండరాల తిమ్మిరి

ఈ లక్షణాలు మీలో కనిపిస్తే..వెంటనే వైద్యుడిని సంప్రదించండి. సరైన చికిత్స తీసుకోండి. కలరా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత సుమారు 2 వారాలకు లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు బయటపడిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.

చికిత్స:

-కలరా లక్షణాలు కనిపించిన వెంటనే ఓఆర్ఎస్ తీసుకోవాలి.

-నీరసం నుంచి బయటపడేందుకు ఫ్లూయిడ్స్ తీసుకోవాలి.

-అవసరాన్ని బట్టి వైద్యుల సూచన మేరకు యాంటీబయాటిక్స్ వాడుతుండాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

-కలరా సోకిన వాళ్లు పరిశుభ్రత పాటించాలి.

-వాష్ రూమ్ కు వెళ్లిన ప్రతిసారి సబ్బుతో చేతులు కడుక్కోవాలి.

-షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు

-బయట ఫుడ్ తినకూడదు

-స్వచ్చమైన ఆహారంతోపాటు, కాచిచల్లార్చిన నీరు తాగాలి.

Tags:    

Similar News