Children Diet: వర్షాకాలంలో పిల్లలకి ఇవి తినిపించాలి.. వ్యాధులకి దూరంగా ఉంటారు..!
Children Diet: వర్షాకాలం హాయినిచ్చే చల్లదనంతో పాటు రకరకాల వ్యాధులని కూడా మోసుకొస్తుంది. అందుకే ఈ సీజన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Children Diet: వర్షాకాలం హాయినిచ్చే చల్లదనంతో పాటు రకరకాల వ్యాధులని కూడా మోసుకొస్తుంది. అందుకే ఈ సీజన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే రోగాల భారిన పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చాలా సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో తొందరగా వ్యాధులకి గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.
కాకరకాయ
కాకరకాయ రుచిలో చేదుగా ఉంటుంది కాబట్టి చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు. అయితే వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యానికి చేదు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల శ్వాస సంబంధిత సమస్యలని దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
పప్పులు
వర్షాకాలంలో పిల్లలను ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడానికి పప్పులను తినిపించాలి. ఎందుకంటే వీటిలో ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అందుకే వర్షాకాలంలో పప్పులు తప్పనిసరిగా డైట్‌లో ఉండేవిధంగా చూసుకోవాలి.
పసుపు పాలు
వర్షాకాలంలో పిల్లలకి తప్పనిసరిగా పసుపు పాలు తాగిపించాలి. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కాబట్టి పిల్లలు రోగాలబారిన పడుకుండా ఉంటారు.
డ్రై ఫ్రూట్స్
వర్షాకాలంలో పిల్లలకు తప్పనిసరిగా డ్రై ఫ్రూట్స్ తినిపించాలి. వీటిలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల శరీరాన్ని శక్తివంతంగా మార్చుతాయి. దీంతో ఈ సీజన్‌లో పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది.