Women Health: మహిళలకి చియాగింజలు సూపర్‌ఫుడ్.. ప్రయోజనాలు తెలిస్తే వదలరు..!
Women Health:మహిళలకి చియాగింజలు సూపర్‌ఫుడ్.. ప్రయోజనాలు తెలిస్తే వదలరు..!
Women Health: చియా గింజలు మహిళలకి సూపర్‌ఫుడ్ అని చెప్పవచ్చు. వీటిలో ఫైబర్, ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మహిళలకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. చియాగింజల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
జుట్టు బలంగా ఉంటుంది
చియా గింజలు మహిళలకి దివ్యౌషధం అని చెప్పవచ్చు. వీటిని డైట్‌లో చేర్చుకుంటే జుట్టు పెరగడమే కాకుండా, జుట్టు రాలడం ఆగిపోతుంది. చియా గింజల్లో ఉండే ఫాస్పరస్ జుట్టు మూలాల్లోకి చేరి వాటిని బలపరుస్తుంది. అందుకే మహిళలు చియా విత్తనాలను తప్పనిసరిగా తీసుకోవాలి.
ముఖం గ్లో పెంచుతుంది..
చియా విత్తనాలను తినే మహిళలు అందంగా కనిపిస్తారు. గ్లో పెంచుతుంది. వీటిని తినడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. ఇందులో ఉండే ప్రొటీన్ స్కిన్ డ్యామేజ్ ను రిపేర్ చేసి మిమ్మల్ని యవ్వనంగా చేస్తుంది.
బరువు తగ్గిస్తుంది..
చియా గింజల ప్రతిరోజు తీసుకుంటే బరువు కంట్రోల్‌లో ఉంటుంది. ఊబకాయం ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. బరువు తగ్గాలంటే చియా విత్తనాలను ఆహారంలో చేర్చుకోవచ్చు.ఇవి తిన్నప్పుడు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. దీంతోపాటు అజీర్ణం, అసిడిటీ సమస్య ఉండదు.
బ్లడ్ షుగర్ కంట్రోల్
చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మహిళలకు మధుమేహం సమస్య ఉండదు. నానబెట్టిన గింజలని తీసుకుంటే చాలామంచిది.