Curry Leaves: కరివేపాకు వాడకుంటే మీరు ఈ ప్రయోజనాలు కోల్పోతున్నట్లే..!

Curry Leaves: భారతీయులు వంటల రుచి పెంచడానికి ఎన్నో రకాల మసాలాలు, ఆకులని ఉపయోగిస్తారు.

Update: 2022-07-30 11:30 GMT

Curry Leaves: కరివేపాకు వాడకుంటే మీరు ఈ ప్రయోజనాలు కోల్పోతున్నట్లే..!

Curry Leaves: భారతీయులు వంటల రుచి పెంచడానికి ఎన్నో రకాల మసాలాలు, ఆకులని ఉపయోగిస్తారు. అందులో ఒకటి కరివేపాకు. సౌత్ ఇండియాలో దాదాపు ఈ ఆకులేనిదే ఏం వంటకం జరగదనే చెప్పాలి. కరివేపాకు ఆహారపు రుచిని పెంచుతుంది. అందుకే చాలా మంది దీనిని మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు. కొందరు ఇంట్లో కుండీలలో పెంచుతారు. కరివేపాకులో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దీని ఉపయోగాల గురించి తెలుసుకుందాం.

1. కళ్లకు మంచిది

కరివేపాకు ఆకులను తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఇందులో ముఖ్యమైన పోషకమైన విటమిన్ ఎ ఉంటుంది. ఇది అంధత్వం లేదా కంటికి సంబంధించిన అనేక వ్యాధుల ప్రమాదం నుంచి కాపాడుతుంది.

2. డయాబెటిస్‌

కరివేపాకులో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉంటాయి. మధుమేహ రోగులు పరగడుపున దీని ఆకులు నమిలితే చాలా మంచిది.

3. జీర్ణక్రియ మెరుగు

కరివేపాకును ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నమలాలి. ఎందుకంటే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఆమ్లత్వం, ఉబ్బరం వంటి అన్ని కడుపు సమస్యలని దూరం చేస్తుంది.

4. ఇన్ఫెక్షన్లను నివారణ

కరివేపాకులో యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది.

5. బరువు తగ్గుతారు

కరివేపాకును నమలడం వల్ల బరువు తగ్గుతారు. ఇది పొట్ట కొవ్వుని కరిగిస్తుంది. ఎందుకంటే ఇందులో ఇథైల్ అసిటేట్, మహానింబైన్, డైక్లోరోమీథేన్ వంటి పోషకాలు ఉంటాయి.

Tags:    

Similar News