Chest Pain: ఛాతినొప్పి అంటే గుండెపోటు మాత్రమే కాదు ఈ 5 వ్యాధులకి సంకేతం కూడా..!
Chest Pain: ఛాతి నొప్పి వచ్చినప్పుడు ప్రజలు తరచుగా గుండెపోటుని ఊహించుకుంటారు.
Chest Pain: ఛాతి నొప్పి వచ్చినప్పుడు ప్రజలు తరచుగా గుండెపోటుని ఊహించుకుంటారు. కానీ ఇది ఒక్క గుండెపోటుకి మాత్రమే కాదు చాలా వ్యాధులకి కారణం అవుతుంది. నొప్పి విషయంలో ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. ఛాతీ నొప్పితో పాటు, చెమటలు పట్టడం, ఊపిరి ఆడకపోవడం, వికారం లేదా కళ్లు తిరగడం వంటివి గుండెపోటుకు సంబంధించిన లక్షణాలుగా చెప్పవచ్చు. ఇవి లేకుంటే ఇతర వ్యాధులు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ వ్యాధుల గురించి ఈరోజు తెలుసుకుందాం.
న్యుమోనియా
ఛాతినొప్పి వచ్చినప్పుడు న్యుమోనియా సమస్య ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని కారణంగా ఊపిరితిత్తులలో గాలి సరఫరా ఎక్కువగా ఉంటుంది. దగ్గుతో పాటు ఛాతీ నొప్పి కూడా మొదలవుతుంది. పిల్లలలో న్యుమోనియా కేసులు ఎక్కువగా కనిపిస్తాయి.
కోస్టోకాండ్రిటిస్
ఛాతీ నొప్పికి కారణం కోస్టోకాండ్రిటిస్ అనే వ్యాధి కూడా కావచ్చు. ఇందులో పక్కటెముకలు వాచి తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో ఈ నొప్పిని గుండెపోటు లేదా గ్యాస్ అని తప్పుగా భావించకూడదు.
ఆంజినా
ఛాతీ నొప్పి ఆంజినా వ్యాధి సంకేతం కూడా కావొచ్చు. ఈ వ్యాధి వచ్చినప్పుడల్లా గుండెలో రక్తం ప్రభావం తగ్గుతుంది. దీని వల్ల ఛాతీ నొప్పి సమస్య ఏర్పడుతుంది. వైద్య భాషలో దీనిని ఇస్కీమిక్ ఛాతీ నొప్పి అని పిలుస్తారు.
పానిక్ అటాక్
పానిక్ అటాక్ కూడా ఛాతీ నొప్పికి కారణం అవుతుంది. ఈ సమస్యలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇది ఎప్పుడైనా రావచ్చు. ఇది చాలా ప్రమాదకరం. అందుకే డాక్టర్‌ని సంప్రదిస్తూనే ఉండాలి.
యాసిడ్ రిఫ్లక్స్
కొన్నిసార్లు ఛాతీ నొప్పి యాసిడ్ రిఫ్లక్స్ వల్ల సంభవిస్తుంది. యాసిడ్ శరీరం అన్నవాహికలోకి ప్రవేశిస్తుంది. ఈ తరహా సమస్యలో పొత్తికడుపు నొప్పి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.