Constipation: మలబద్దకంతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి..!
Constipation: ప్రస్తుత కాలంలోని బిజీ లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.
Constipation: ప్రస్తుత కాలంలోని బిజీ లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిలో మలబద్ధకం అతి పెద్ద సమస్య. సకాలంలో నియంత్రించకపోతే పైల్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. దీనికి చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ ఇంట్లో కొన్ని చిట్కాలని పాటించడం ద్వారా మీరు ఉపశమనం పొందవచ్చు. అలాంటి కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.
1. ఆహారంలో మార్పులు
మలబద్ధకం నుంచి ఉపశమనం పొందాలనుకుంటే జిడ్డుగల ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ప్రారంభించండి. ప్రతి గంటకు ఏదైనా తినే అలవాటును వదిలివేయండి. ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేట్లు చూసుకోండి.
2. జీలకర్ర నీరు
అజ్వైన్, జీలకర్ర మలబద్ధకం సమస్యను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండు మసాలా దినుసులను తక్కువ మంటపై వేయించి పొడిని సిద్ధం చేసుకోవాలి. చెంచా పొడిని తీసుకొని వేడి నీటిలో కలుపుకొని క్రమం తప్పకుండా తాగాలి. ఇలా చేస్తే మలబద్ధకం సమస్య దూరమవుతుంది.
3. గోరువెచ్చని నీరు
ఉదయాన్నే నిద్రలేచి బాత్‌రూమ్‌కి వెళ్లిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగితే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు వేడి నీటిని తాగినప్పుడు ఒత్తిడికి గురవుతారు. కాసేపు వేచి ఉండి ఆపై బాత్రూమ్‌కి వెళ్లాలి.
4. నెయ్యి కలిపిన పాలు
పాలను సంపూర్ణ ఆహారం అంటారు. ఎందుకంటే ఈ సూపర్‌ఫుడ్‌లో అనేక పోషకాలు కలిసి ఉంటాయి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కొంచెం నెయ్యి కలుపుకుని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పొట్ట క్లియర్ అవుతుంది. మలబద్ధకం సమస్య దూరమవుతుంది.