Health Tips: ఈ హెల్తీ ఫుడ్ కాంబినేషన్‌తో మలబద్దకానికి చెక్.. ఇప్పుడే డైట్‌లో చేర్చుకోండి..!
Health Tips: నేటి రోజుల్లో ప్రజల జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి.
Health Tips: నేటి రోజుల్లో ప్రజల జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. రాత్రిపూట ఆలస్యంగా తినడం, నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ఇతర చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతుంది. ఆహారం సరిగా జీర్ణం కానప్పుడు మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. అందుకే ఆహారంలో మార్పులు చేయడం అవసరం. పెరుగు, అరటిపండును సరిగ్గా ఉపయోగిస్తే మలబద్ధకం సమస్యను నివారించవచ్చు. ఈ రెండు మార్కెట్‌లో చాలా తక్కువ ధరకు వస్తాయి.
మలబద్ధకంతో ఇబ్బంది పడే వ్యక్తులు అల్పాహారంలో అరటిపండు, పెరుగు ఉపయోగించాలి. ఈ రెండు ఆహారాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో సహాయపడుతుంది. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్లు, కాల్షియం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అరటిపండులో ఐరన్, విటమిన్స్, ఫైబర్ ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అల్పాహారం సమయంలో ఈ రెండు ఆహారాలను తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రోజంతా శక్తి లభిస్తుంది.
అల్పాహారంలో అరటిపండు, పెరుగును చేర్చుకుంటే అది ఎముకలను బలపరుస్తుంది. అంతేకాదు కొవ్వు కరుగుతుందని డైట్ నిపుణులు చెబుతున్నారు. దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రెండు మార్కెట్‌లో తక్కువ ధరకే లభిస్తాయి. కాబట్టి సాధారణ ప్రజలు కూడా వీటిని డైట్‌లో చేర్చుకోవచ్చు. వచ్చేది ఎండాకాలం కాబట్టి ఈ రెండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.