Women Health: ప్రెగ్నెన్సీ టైంలో ట్రావెలింగ్ చేయొచ్చా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి..!
Women Health: తల్లికావడం అనేది మహిళలకు చిరకాల స్వప్నం. కానీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత దానిని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం.
Women Health: తల్లికావడం అనేది మహిళలకు చిరకాల స్వప్నం. కానీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత దానిని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం.ఈ సమయంలో వారికి విశ్రాంతి చాలా అవసరం. ఆహారపు అలవాట్ల నుంచి లేవడం, కూర్చోవడం వరకు అన్ని సమస్యలు ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ప్రయాణం చేయవలసి వస్తే కచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీని గురించి ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ప్రయాణం సరైనదా కాదా అనే విషయం గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఎప్పుడు ప్రయాణం చేయాలి..?
గర్భం దాల్చిన రెండో త్రైమాసికంలో ప్రయాణం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రయాణానికి సురక్షితమైన సమయం. దీంతో పాటు ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. కొన్నిసార్లు ప్రయాణం వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. మొదటి త్రైమాసికంలో గర్భస్రావం ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో రెండో త్రైమాసికం అంటే 3 నుంచి 6 నెలల మధ్య ప్రయాణానికి ఉత్తమ సమయంగా చెప్పవచ్చు.
మూడో త్రైమాసికంలో సురక్షితం
ఉదయం నిద్రలేచిన తర్వాత తలనొప్పి, వాంతులు, మార్నింగ్ సిక్‌నెస్ వంటి సమస్యలు మూడో త్రైమాసికంలో తక్కువగా ఉంటాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఈ సమయంలో మహిళలు మంచి అనుభూతి చెందుతారు.
ఈ పనులు చేయండి
ప్రెగ్నెన్సీ సమయంలో ట్రిప్ ప్లాన్ చేస్తే వైద్యుడిని సంప్రదించి అవసరమైన అన్ని చెకప్‌లను చేయించుకోండి. దీనితో పాటు ప్రయాణంలో భద్రత, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోండి. డాక్టర్ ఇచ్చిన డెలివరీ డేట్, ప్రెగ్నెన్సీ రిపోర్టుల కాపీని దగ్గర ఉంచుకోండి. టీకా, మెడిసిన్ కోర్సు గురించి పూర్తి సమాచారాన్ని పొందండి.