Thyroid Problem: మానసిక ఒత్తిడి థైరాయిడ్‌కు కారణం అవుతుందా.. ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటంటే..?
Thyroid Problem: మానసిక ఒత్తిడి అనేది అతి పెద్ద వ్యాధి. చెప్పాలంటే దీనికి సరైన మందు కూడా లేదు. ఇది అనేక రకాల సమస్యలకు దారి తీస్తుంది.
Thyroid Problem: మానసిక ఒత్తిడి అనేది అతి పెద్ద వ్యాధి. చెప్పాలంటే దీనికి సరైన మందు కూడా లేదు. ఇది అనేక రకాల సమస్యలకు దారి తీస్తుంది. మధుమేహం, బీపీ, థైరాయిడ్ వంటి సమస్యల ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఒత్తిడి హార్మోన్ థైరాయిడ్ ను మరింత ప్రేరేపిస్తుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి, థైరాయిడ్ మధ్య గల సంబంధం గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఒత్తిడి, థైరాయిడ్ మధ్య సంబంధం
మెడలో సీతాకోకచిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంధిఉంటుంది. ఇది జీవక్రియ నియంత్రణకు, శరీరంలో శరీర ఉష్ణోగ్రతను మెయింటెన్ చేయడానికిక పనిచేస్తుంది. ఇది పనిచేయడం మానేసినప్పుడు ఒత్తిడితో సహా అనేక సమస్యలను కలిగిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి హషిమోటోస్ థైరాయిడిటిస్, గ్రేవ్స్ డిసీజ్ వంటి ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ప్రమాదంతో ముడిపడి ఉంటుంది.
ఈ పరిస్థితిలో రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంధిపై దాడి చేస్తుంది. థైరాయిడ్ పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడి థైరాయిడిటిస్ అభివృద్ధిని పెంచుతుంది. ఈ సమయంలో థైరాయిడ్ గ్రంధి వాపునకు గురవుతుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలంలో థైరాయిడ్ పనితీరును మార్చుతుంది. ఇది మాత్రమే కాదు ఒత్తిడి థైరాయిడ్ హార్మోన్లను నియంత్రించే హైపోథాలమస్, పిట్యూటరీ గ్రంధిని ప్రభావితం చేస్తుంది.
ఒత్తిడిని నివారించాలంటే..
మానసిక సమస్యలను కంట్రోల్‌లో ఉంచుకుంటే అనేక రకాల సమస్యలను ముందుగానే నివారించవచ్చు. మీరు ఒత్తిడిని జయించాలంటే ధ్యానం, యోగా సాయం తీసుకోవాలి. సంతోషకరమైన హార్మోనులను విడుదల చేసే కార్యకలాపాల్లో పాల్గొనాలి. నెగిటివ్ విషయాలకు దూరంగా ఉండాలి. థైరాయిడ్‌ను స్థిరంగా ఉంచడంపై దృష్టి పెట్టాలి. అయోడిన్ తక్కువగా ఉన్న వాటిని మాత్రమే తినాలి. పెరుగు వంటి ప్రోబయోటిక్స్ తీసుకోవాలి.