Epilepsy: మూర్ఛ వ్యాధి ఉన్నవారికి పిల్లలు పుట్టరా..! ఇది నిజమేనా..?
* మూర్ఛ అనేది మెదడుకు సంబంధించిన నాడీ సంబంధిత సమస్య.
Epilepsy: నేటికీ చాలామంది మూర్ఛ రోగులను తప్పుగా భావిస్తారు. వారిని దూరంగా ఉంచుతారు, వివక్ష చూపుతారు. వారు దేనికి పనికిరారని నింద వేస్తారు. ఇది కరెక్ట్ కాదు. వారికి ఈ భూమిపై బతికే హక్కు ఉంది. మూర్ఛ రోగి అందరి లాగే సాధారణ జీవితాన్ని గడపగలరు. ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. మూర్ఛ వ్యాధి ఉన్నవారికి పిల్లలు పుట్టకపోవడమనేది అబద్దం. ఈ వ్యాధి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
మూర్ఛ వ్యాధి ఉన్నవారికి పిల్లలు పుట్టకపోవడమనేది అబద్దం. ఇది అస్సలు నిజం కాదు. మూర్ఛ వ్యాధిగ్రస్తులు కూడా ఇతర ఆరోగ్యవంతమైన వ్యక్తుల మాదిరిగానే సాధారణ జీవితాన్ని గడపవచ్చు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనవచ్చు. మూర్ఛ కారణంగా మహిళల సంతానోత్పత్తి ప్రభావితం కాదు. మూర్ఛ వ్యాధి గ్రస్థులు సాధారణ వ్యక్తులతో పాటుగా సమానమైన తెలివితేటలను కలిగి ఉంటారు.
అలాగే ప్రతి మూర్ఛ వ్యాధి కాదు. అధిక ఉష్ణోగ్రత, తలకు గాయం అయినప్పుడు, మద్యపానం కారణంగా కూడా మూర్ఛ సంభవించవచ్చు. ఒక వ్యక్తి స్ట్రోక్‌కు గురైనట్లయితే అతను డాక్టర్‌తో మాట్లాడాలి తద్వారా ఖచ్చితమైన కారణం తెలుస్తుంది. రోగికి మూర్ఛ వచ్చినప్పుడు నోటిలో లోహ సంబంధిత వస్తువులు పెట్టకూడదు. వాసన చూపించకూడదు.
మూర్ఛ అనేది మెదడుకు సంబంధించిన నాడీ సంబంధిత సమస్య. దుష్టశక్తులతో దీనికి సంబంధం లేదు. మూర్ఛ వ్యాధి చికిత్స రోగి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. 3 నుంచి ఐదు సంవత్సరాల వరకు కొనసాగుతుంది. మూర్ఛ వ్యాధిని మందులు, శస్త్రచికిత్స, ఆహారం, అనేక ఇతర రకాల చికిత్సల ద్వారా నయం చేయవచ్చు. దీని ప్రభావం తగ్గించవచ్చు. మూర్ఛరోగి సాధారణ మనిషిలా జీవించగలడు. అటువంటి రోగులలో 90 శాతం మందికి మందులతో మాత్రమే చికిత్స చేస్తారు. 10% కేసులలో శస్త్రచికిత్స అవసరం.