Cabbage: కాల్షియం లోపంతో బాధపడేవారికి క్యాబేజీ బెస్ట్‌.. ఎలాగంటే..?

Cabbage: కాల్షియం లోపంతో బాధపడేవారికి క్యాబేజీ బెస్ట్‌.. ఎలాగంటే..?

Update: 2022-02-07 09:30 GMT

Cabbage: కాల్షియం లోపంతో బాధపడేవారికి క్యాబేజీ బెస్ట్‌.. ఎలాగంటే..?

Cabbage: నిత్య జీవితంలో కాల్షియం లోపంతో చాలామంది బాధపడుతుంటారు. కాల్షియం అనేది శరీరానికి చాలా ముఖ్యమైనది. శరీరంలోని ఎముకలు, దంతాలు, గుండె ఇలా ప్రతి అవయవానికి కాల్షియం అవసరముంటుంది. కాల్షియం సరిగ్గా ఉంటేనే ఎముకలు దృఢంగా ఉంటాయి. అన్ని జీవక్రియలకు కాల్షియం ఎంతో అవసరం. కానీ మారిన జీవన విధానం, ఆహార పరిస్థితుల కారణంగా కాల్షియం లోపంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆహారంలో మార్పు చేయడం ద్వారా కాల్షియంలోపాన్ని నయం చేయవచ్చు. క్యాబేజీలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. రోజువారీ డైట్‌లో దీనిని చేర్చితే చాలా ప్రయోజనాలు ఉంటాయి.

క్యాబేజీలో పాలతో సమానంగా కాల్షియం ఉంటుంది. ఇది మీ ఎముకలను బలపరుస్తుంది. చాలా మంది పాలు తాగడానికి ఇష్టపడరు. అలాంటివారికి క్యాబేజీ మంచి ఎంపిక అవుతుంది. క్యాబేజీ కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి పనిచేస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల కడుపులో ఉన్న నులిపురుగుల సమస్య కూడా నయమవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు క్యాబేజీని ఆహారంలో చేర్చుకోవాలి. ఉడికించిన క్యాబేజీలో 33 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇది మీ శరీరానికి పుష్కలంగా శక్తిని ఇస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. మీరు సూప్, కూరగాయలు, సలాడ్ రూపంలో దీనిని తీసుకోవచ్చు.

క్యాబేజీలో ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో రక్తం లేకపోవడాన్ని తొలగిస్తుంది. బీపీ, గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహకరిస్తుంది. మీరు కండరాల నొప్పితో బాధపడుతుంటే క్యాబేజీ మీకు చక్కటి ఉపశమనం ఇస్తుంది. ఇందులో లాక్టిక్ యాసిడ్ అనే మూలకం ఉంటుంది ఇది సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. అందుకే ప్రతిరోజు క్యాబేజీని ఏదో ఒక రూపంలో తీసుకుంటే కాల్షియం సమస్యలను తొలగించవచ్చు. 

Tags:    

Similar News